నేను సాఫ్ట్ వేర్ విద్యార్థినిని. వాడుకరి:Pavan santhosh.s ప్రోత్సాహంతో వికీపీడియాలో చేరాను. సాఫ్ట్ వేర్ కు సంబంధించిన అంశాలు నేర్చుకుంటూనే వికీని సాంకేతికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాను. పుస్తకాలను గురించి కూడా వ్రాసే ప్రయత్నం చేస్తాను.
ఈ నాటి చిట్కా...
బొమ్మలను "క్రాప్" చేయడం
ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.