నా పేరు ఆత్రం మోతీరామ్ నాది తెలంగాణ రాష్ట్రం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నగర్ గుట్ట మా స్వస్థలం, మా అమ్మ నాన్న ఆత్రం మారు బాయి, రాము గార్లకు నేను 6 సెప్టెంబర్ 1995 జన్మించాను.

చదువు

మార్చు

నా విద్యాభ్యాసం మా గ్రామ సమీపంలో ఉండే చౌపన్ గూడ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ప్రాథమిక విద్య ను పూర్తి చేసుకున్నాను. ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల పివిటీజీ-బాలురు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చదవుకున్నాను. ఇంటర్మీడియట్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళశాల బాలురు-ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి చేసుకున్న నేను ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అలాగే సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో బి.ఇడ్ పూర్తి చేశాను. కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా ఎం.ఏ తెలుగు చదవుకున్నాను.

పుస్తకాలు

మార్చు
  1. కొలాం వీరుడు కుంరం సూరు
  2. దండారి (కైతికాలు)
  3. దంతన్ పల్లి భీమయ్యక్ మహాత్మ్యం
  4. మోతిరాము శతకం

పురస్కారాలు

మార్చు
  1. సాహితీ తరంగిణి-2019
  2. కైతిక కవి మిత్ర పురస్కారం-2020
  3. అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం-2020
  4. సాహిత్య విక్రమార్క పురస్కారం-2020
  5. భాషా శ్రీ పురస్కారం-2021
  6. విశిష్ట కవి రత్న పురస్కారం-2021
  7. గాంధీ సాహిత్య రత్న పురస్కారం-2021
  8. ఉసావే సాహితీ సేవాస్ఫూర్తి పురస్కారం-2023

బిరుదులు

మార్చు
  1. కవన కోకిల[1]
  2. దేశ భక్త సాహిత్య భాస్కరా[2]

మూలాలు

మార్చు
  1. సాక్షి (2021-02-21), గిరి కవన కోకిల లు, retrieved 2024-07-22
  2. Enadu, సాహితీ వనంలో ఆదివాసీ సుమం, retrieved 2024-07-22