Naagulavancha
Joined 25 మే 2007
మాతృభాష మాధుర్యం
మార్చుభరత ఖండమందు ఆంధ్ర దేశమ్ములో తెలుగు తల్లిపాలు లెస్స త్రాగి అమృతమ్మువంటి అమ్మపదము మరచి మమ్మి యనుచు లెస్స తిరిగినావు రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయిన పగిది విత్తంబు కోసమై విదేశాలకేగి ఉద్యొగంబులేక ఊడిగాలు చేసి మాతృభాషనేమొ మరచినావు ఆరంభశూరుదు ఆంధ్రుడేనటంచు మధ్యలోనె తెలుగు మరచినావు పరభాష మోజులో మాతృభాషను మరచి ఆంధ్రమాతకు ద్రోహంబు చేసినావు అవలక్షణాలున్న ఆంగ్లభాష కన్న తేనెలొలుకుచున్న తెలుగుభాష మిన్న రాయలు మెచ్చిన రాజభాష తెలుగు మధురమైనట్టిది మాతృభాష తెలుగు తెలుగు బిద్దనంచు తెగ చెప్పుకొని నీవు ఆంగ్లభాషలోన అతి ప్రయాసగ మాట్లాడి మాతృభాష యనగ మౌనంబు వహియించి టెలుగుభాషకు తెగులు సోకించినావు తెలుగునాట బుట్టి తెలుగునాట పెరిగి తెలుగు సంస్కృతియు తెలిసి నీవు అన్యభాషలోన అతి యాసగ మాట్లాడి తెలుగు తెలియనట్లు తెగఫొజులిస్తివి పొరుగు రాష్త్రాలలో అతిదొడ్డ మనసుతో మాతృభాషలోన మధురంగ మాట్లాడి మాతృభాషామ తల్లిని బహుగ రక్షించగ తెలుగు మాట్లాడుటకు తెగ సిగ్గుపడితివి మాతృభాషలోన పరిపాలనను జరుప ఉత్తర్వులెన్నియో వెడలుచున్నను గాని మానసంబున నీకు మాతౄభాష పైన ప్రేమ పుట్టకపోతె ఫలితమేమి ? విఙులైనవారు విషయంబు గ్రహియించి ఆంధ్రమాత హృదయ స్పందనను గమనించి నిత్యజీవితాన అత్యంత ప్రేమతో మాతృభాష తెలుగు మరువకుందురు గాక !