''' మరుపు '''

   ఇది  ఒక  ప్రేమ  కావ్వం!

           1996  ఫిబ్రవరి  14  '' సుప్రియా  ఒక్క నిమిషం''  '' ఎంటి  శ్రీను''  '' ఏమి  లేదు''  చెప్పల  వద్దా అనే  విధంగా  తడబాటుతో  '' అది  అది''  '' శ్రీను చెప్పు''   '' నేను  సీతను  ప్రేమిస్తున్నాను  ఈ  విషయం తనతో  చెప్పగలవ ''  '' అదేంటి  తనతో  నువ్వే చెప్పచ్చుగా ''   '' తన  కళ్ళు చూస్తు  చెప్పలేను,  తను  చెప్పె  మాట  చెవితో  వినలేదు.  అందుకే  నీ  ద్వారా చెప్పలనుకున్నాను '' '' తనకి  ఇష్టం  లేదంటే''   '' నేను బ్రతికున్నంత  కాలం  నాతో  ఉందన్న  ఆశతో బ్రతికెస్తాను '' '' సీత  ఎలా  వుంటుందో  చూశావ ''  '' చూశాను  కాని  సీత  నన్ను  చూడలేదు ''   '' అదేంటి " '' అవును  సీతను  చూసిన  ఆ  క్షణం  పుట్టిన  ప్రేమ తన  కంటికి  నన్ను  కనిపించకుండ  చేసింది ''   '' సరే శ్రీను,  సీత  సమాధానం  ఏదైన  నువ్వు  నాకు కనిపిస్తుండాలి "  '' నేను  చనిపోయేంత  పిరికి  వాన్ని కాదులే  సుప్రియా "  అక్కడ  నుండి  ఇద్దరు  ఎవరు దారి  వారు  వేళాతారు.  తరువాత  10  రోజులకి సుప్రియా,  సీతను  కలుస్తుంది.  '' ఎక్కడికేళ్ళవు  సీత ఈ  మధ్య  కనిపించడం  లేదు ''    '' నేనా '' '' లేదు  నీ పక్కన  వున్న  చెట్టును  అడిగాను ''  '' అయ్యో సుప్రియా  క్షేమించు  పుస్తకం  చదువుతు వినిపించుకోలేదు  అంతే "  '' నీతో  కాస్త  మాట్లడాలి " '' ఆ  చెప్పు "   " శీను  తెలుసా  నీకు ''   '' ఏ  శీను '' '' కామర్ల  శీను  వెనుక  బెంచి ''  " చూడలేదు  కాని మాట  వినిపిస్తు  వుంటుంది.  సర్లె  చెప్పు ''   '' తాను నిన్ను  ప్రేమిస్తున్నాడు ''  అని  సుప్రియా  సీతతో చెబుతుంది.  ఆ  మాట  విన్న  సీతకు  ఎటువంటి కోపంకాని,  ద్వేషంకాని,  అసుయకాని, చిదరింపుకాని,  ఏవి  కనిపించావు.  దానికి సుప్రియాతో  ఇలా  అంటుంది.  "  ప్రేమించడం తప్పుకాదు  అది  నన్నుకాని,  నిన్నుకాని, ఇంకోకరినికాని,  ఎవరు  ఎవరినైతే  ప్రేమిస్తున్నరో వారు  ఎమి  కోరుకుంటున్నారు  అన్నాది  ముఖ్యం. సరే  శీను  నన్ను  ప్రేమిస్తున్నాడు  కాని  నేను  తన నుండి  ఏమి  కోరుకుంటున్ననో  నీకు  తెలుసా!''  '' నాకు  ఎలా  తెలుసు  సీత  నువ్వు  చెబితే తెలుస్తుంది. ''   '' ఇప్పుడు  చదివే  చదువు  చివరి స్తాయి  ఈ  టైంలో  ప్రేమ  అంటే  జీవితం పాడైపోతుంది.  ఒక  వ్యక్తి  నా  వల్ల  తన  జీవితాన్ని నాశనం  చేసుకోవడం  నాకు  ఇష్టం  లేదు  ''   ''  అది కాదు  సీత ''   '' ఏది  కాదు  శీనును  తన  లక్ష్యం ఎంటో  తెలుసుకుని  దాన్ని  సాధించి  నాకు కనిపించమను,  అప్పటి  వరకు  తనని  తప్ప  మరే మగడి  గురించి  అలోచించను. "  అని  సీత సుప్రియాకు  చెపుతుంది.

                       ఇదంత  శీను  చెట్టు  చాటు  నుండి వింటాడు.  సుప్రియా,  శీనుతో  ఇలా  అంటుంది.  " శీను  నీ  లక్ష్యం  ఎంటి ''   '' ఎందుకు  అడుగుతున్నవ్ "   '' అది  కాదు  తెలుసుకుందామని  ''   ''  గొప్ప శాస్త్రవేత్త  కావలన్నాది  నా  కల ''   ''  అది ''   ''నేను అంత  విన్నాను  సుప్రియా,  ప్రేమించడం  గొప్పకాదు, ప్రేమించబడడం  గొప్ప,  అని  నాకు  అర్ధం  అయింది. ''   "ఈ  రోజు  నుండి  నా  లక్ష్య  సాధనే  నా  అడుగు "  అని  సుప్రియాతో  చెప్పి  అక్కడ  నుండి  వేళ్తాడు.

                           అప్పటి నుండి కళాశాలలో కనిపించకుండా  తిరుగుతాడు.  అది  చదువు  ముగిసే  చివరి  రోజులు.  కష్టపడి  చదివి  తన లక్ష్యన్ని  సాధిస్తాడు.  చదువు  అయిపోతుంది. విద్యార్ధులు  ఉద్యోగ  రిత్య  ఎవరి  దారి  వాళ్ళు వేళ్తారు.  సీత   ఒక   ఉద్యోగానికి  నియమకం  అయ్యి,  ఉద్యోగంలో  చేరడానికి   లేఖ  కోసం  ఎదురుస్తు  వుంటుంది.  పచ్చని  పంట  పోలలు  చూట్టు   ప్రకృతి  అందాలు  వున్నటువంటి  రాజంపేట  మండలం  తాళ్ళపాక  గ్రామనికి  చేరుకుంటుంది.  ఇంటి  దగ్గర  పల్లె  వాతావరణం,  పచ్చని  పోలల  అందాలను  ఆశ్వదిస్తు  వుంటుంది.  ఇలా  18  నెలల  కాలం  గడిచిపోతుంది.  శుక్రవారం  తలంటు  స్నానం  చేసి,  తలకు  రుమలు  చూట్టి  తన   ఇంటి  మేడ  పైకి  తడిచిన   కురులను  రుమలుతో   తుడుస్తు  అటుఇటు  తిరుగుతు  వుంటుంది.  తన  ఇంటిపై  నుండి  తనకు  కనిపించే  విధంగా  రోడ్డు  మలుపు  వుంటుంది.  లక్ష్యన్ని  సాధించిన  శీను  ఇప్పుడు  సీత  తన  ప్రేమను  కాదనదు  అనే  నమ్మకంతో  సుప్రియాను  కలిసి  సీత  ఎక్కడ   ఉన్నాది  తెలుసుకుని  అమె  కోసం  341  కిలోమీటర్లు  ప్రయాణిస్తు  సీతను   చేరుకునే   2 నిమిషల  సమయం  అది,  సీత   మేడ పై  తడిచిన  కురులను  తుడుస్తు  కళాశాల  రోజులను  గుర్తు  చేసుకుంటు  మలుపు  వంక   అలా  చూస్తుంది.  అప్పుడే   పెద్ద  శబ్ధంతో  ప్రమాదం  జరుగుతుంది.  సీతను   త్వరగా  కలుసుకోవలన్న   తొందరతో   ఎదురుగా   ఏమి  వస్తున్నాది  చూసుకోకుండా  నాలుగు   చక్రాల  వాహనానికి  గుద్దెస్తాడు.  అది  సీత  చూస్తుండగానే  జరుగుతుంది.   పరుగు పరుగున   సీత  అక్కడకు  వస్తుంది.   ఎవ్వరు  పట్టించుకోరు   సీతనే  ముందడుగు  వేసి  ఆసుపత్రికి తిసుకు  వేళుతుంది.  చికిత్స   అయిన  తరువాత  15  రోజులకి   స్ర్పూహలోకి  వస్తాడు.  సీతకు  శీను  ఎవరో   తెలిసిన  శీనును   చూడకపోవడం  చేత  శీను  ఎవరు  అన్నాది   గుర్తించలేకపోతుంది.   స్ర్పూహలోకి   వచ్చిన   శీనును  డాక్టర్లు  పలకరిస్తే '' నేనేంటి  ఇక్కడ,  ఎవరు  మీరు,  ఎంటి  నాకు  ఇవన్ని తగిలించారు.''   అనగానే  డాక్టర్  ఇతనికి  గడిచిన కాలం  గుర్తుకురాలేదు.  అని  నిర్ధరణకు   వస్తారు.  ఈ  విషయం  సీతకు  చెప్పి  శీను  దగ్గరకు తీసుకువస్తారు.  ఎదురుగా  ప్రేమించిన  అమ్మాయి ఉన్న  గుర్తుపట్టాలేని  స్థితి  శీనుది.   డాక్టర్  సీతతో '' చూడమ్మ  ఇతను నీకు   ఎమౌతాడో  నాకు తెలియాదు,  ఇప్పుడు  ఇతను  పుట్టిన  బిడ్డతో సమానం  ఎంత  ప్రేమగా  చూసుకుంటే  అంత త్వరగా  కోలుకుంటాడు. ''  అని  డాక్టర్  చెప్పడంతో చంటిబిడ్డల  శీనును  చూసుకుంటుంది.  ఆసుపత్రి నుండి  సీత  శీనును  తన  ఇంటికి  తిసుకువచ్చి  తన కుటుంబ   మనిషిల  మానవత్వంతో  తన  దగ్గర వుంచుకుంటుంది.  ఊరి  ప్రజలు  అపర్ధపు  మాటలు మాట్లడడంతో  వున్న  ఊరిని  వదిలేసి  పట్టణం చేరతారు.  ఇద్దరి  మధ్య  స్నేహభావం, అన్యున్యితభావం,  కలుపుగొలుతనం,   ఒకరినోకరు అర్ధం  చేసుకోవడం,  బాగుంటుంది.  శీనుకు  పేరు పెట్టె  అదృష్టం  తల్లిదండ్రుల  తరువాత  సీతకు దక్కుతుంది.  రఘు  అని  నామకరణం  చేస్తుంది. సీతపై  చూపే  అభిమానం  తన  గురించి  తీసుకునే జాగ్రత్తను  చూపే  రఘు [శీను] పై  సీతకు  ప్రేమ పుడుతుంది,  అది  తప్ప  ఒప్ప  అనే  అలోచనలో వుండగా  సుప్రియాతో  అన్నా  మాటలు  గుర్తుకు వచ్చి '' నన్ను  ప్రేమించిన  వ్యక్తిని  చూడలన్న  ఆశ కలుగుతుంది.  నేను  ప్రేమించిన  రఘు  [శీను]  గొప్ప, నన్ను  ప్రేమించిన  శీను  గొప్ప ''  అనే  భావన  సీతకు కలుగుతుంది.  తన  స్నేహితురాలు  సుప్రియా  కోసం వేదుకుతుంది.  తనకు  తెలిసిన   వారిని   అడుగుతుంది,  ఫోన్  నంబర్  కోసం  ప్రయాత్నిస్తుంది.  ఇలా  చాలా  విధాలుగా   ప్రయాత్నిస్తుంది.  చివరకు  విసుగు  చెంది  '' ఇంతగా తన  కోసం  వేదికిన  కనిపించలేదు,  అసలు  వుందా లేదా  ఆ రోజు  నేను  అన్నా  మాటలకు  శీను ఆత్మహత్య  చేసుకున్నాడ  అది  సుప్రియా  చూసి నన్ను  దూరం  పెట్టిందా ''   అలాంటి  అలోచనలు వస్తాయి.  ఆ  అలోచనలతో  వున్న  సీత  ముఖంలో కళ  తప్పుతుంది.  అది  గమనించిన  రఘు [శీను] సీతను  తిసుకుని  రామ  మందిరానికి తీసుకుపోతాడు.

                          సీత  గుడిలో  అడుగు  పెట్టగానే మనస్సు  తెలిక  అవుతుంది.  ఇన్ని  రోజులు అనుభవించిన  కష్టం  ఈ రోజు  తీరుతుంది.  అనే ఆశ  పుడుతుంది.  ఇద్దరు  సీతరాములను దర్శించుకుని  మెట్లు  దిగి  బయటకు  వస్తుంటారు. బయట  నుండి  సుప్రియా  గుడి  లోపలికి  వస్తు రఘును  చూసి   '' శీను ''  అని  పిలుస్తుంది  పలకడు మళ్ళీ  పిలుస్తుంది  పలకడు దగ్గరకు  పోయి '' ఏ  శీను  పిలుస్తుంటే  పలకవే  మార్చిపోయావ  నన్ను '' '' ఎవరు  నువ్వు  శీను  అంటున్నావ్  నా పేరు  రఘు '' ఆ  మాట వినగానే  అశ్చర్యపోతుంది. ''  రఘు  వెనుక  నుండి  సీత  వస్తుంది.  సీత  సుప్రియాను చూసి  '' ఎక్కడని  నిన్ను  వెదకనే   నీ  కోసం  ప్రయాత్నించిన   143  రోజులకు  కనిపించావు,  నీతో చాల  మాట్లడాలి. ''   '' నాతో  మాట్లడేది  ఏముంది ఇద్దరు   ఒక్కటయ్యరుగా,  వాడేంది  నేనేవరో తెలియని  దానిలా  మాట్లడుతున్నాడు,  నన్నే మరిచిపోయేంతగా  మరిపోయడ ''   '' ఎవరిని  చూసి ఎం  మాట్లడుతున్నవే ''   ''  శీనును  చూసి ''  '' శీను  నా  ఎక్కడ ''   ''  అదిగో  వాడే ''   ఒక్కసారిగా  సీత జరిగిన  కాలం  అంత  గుర్తు  చేసుకుంటుంది.  కళ్ళల్లో  నీరు  కరుస్తు  '' సుప్రియా  ఎంటి  నువ్వు అనేది ''   '' అవును  వీడే  శీను,  నువ్వు  అన్నా మాటను  కర్ణుడిలా  పట్టుకుని  ఒక  గొప్ప  శాస్త్రవేత్త అయి  నా  దగ్గరకు  వచ్చి  నీ  గురించి  తెలుసుకుని   నీ  కోసం  బయలుదేరడు  అంతే  ఇప్పుడు  ఇక్కడ  కనిపిస్తే  నువ్వు  ఎవరు  అంటున్నాడు ''   ''  శీను తనేన ''   అని  తనకుతనుగా  సంతోషిస్తు,   బాధపడుతు,  తప్పుచేశాన  అని  బయపడుతు  అన్ని  విధాల  ముఖంలో  భావలను  చూపుతుంది. సుప్రియా  చూసి  '' సీత  ఎందుకు  ఎడుస్తున్నవు నిన్ను  కోరుకున్నవాడు  నీతో  ఉన్నాడు,  నీతో ఉండలనుకున్నవాడు  ఎలా  వుండాలో  అలాంటి వాడు  నీతో  ఉన్నాడు.  దీనికి  ఎడ్చల్సిన  అవసరం లేదే ''  అది  కాదు  సుప్రియా  అంటు  సుప్రియా  దగ్గర నుండి  బయలుదేరిన  శీను,  సీతను  ఎలా చేరుకున్నాడు,  రఘుగా  ఎలా  పేరు  మరింది ఇప్పుడు  తనకు  కలిగిన  భావల  వరకు  అంత సుప్రియాకు   వివరిస్తుంది.   విషయం   తెలుసుకున్న సుప్రియా   రఘుకు  కొత్త   స్నేహితురాలు   అవుతుంది.  రఘుకు  తన  ప్రేమ  విషయం  ఎలా   చెప్పలో   తెలియని   స్థితిలో  వున్న  సీతకు,  సుప్రియా   రఘుకు  సీత  ప్రేమ  గురించి చెపుతుంది.

                       అప్పుడు  శీను  ప్రేమ  గురించి సీతకు  చెప్పిన  సుప్రియా,   ఇప్పుడు  సీత   ప్రేమ  గురించి  రఘు [శీను] కు   చెపుతుంది.

         ప్రేమను  మరిచిన  ప్రేమికుడికి "ప్రేమ" ఈ విధంగా  దగ్గరైంది.