10

వినిపించే ప్రయత్నం చేసింది. డా, బి.ఆర్.అంబేద్కర్ కృషి ఫలితంగా కొంతవరకు దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని, కొంత వరకైనా దలితులు ఆత్మగౌరవంతో తిరగగలుగుతున్నారని మల్లవరపు జాన్ 'నీ మూలనగదా! నేటి తరము రాజ్యాంగ హక్కుల రహస్యం తెలుసుకుందని, ఊరికి సుదూరంలో నివాసముండెవారు చేరువయ్యారని ' అన్నాడు.రేఖామాత్రంగా దళితసాహిత్యాన్ని ఇందులో స్పృశించిన ఎందరో కవులు, రచయితలు దళితసాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూనే ఉన్నారు.
శంబుక పేరు పెట్టుకున్న ప్రత్తిపాటిమల్లేశ్వరరావు రచించిన 'కులమయ మిదం భారత్ ' లో చెప్పినట్టు కులం ప్రస్తావన అనేది లేకుండా ఎక్కడా లేదు. దానిని గుడి, బడి, ప్రేమలో పెళ్ళిలో, ఓట్లలో సీట్లలో ఎక్కడైనా కులమే. దేశ వ్యాప్తంగా విభిన్నసంస్కృతులన్నా అస్పృశ్యత దళితుల్లోనే కనిపిస్తోంది.సంస్కృతీ వైవిధ్యం దళితుల్లో ఎక్కువగా కనిపించినా, కులం అంటరానితనం వారందరినీ ఏకతాటిమీదకు తెచ్చింది.
దళితసాహిత్యం మరింతగా తన పరిధిని పెంచుకుంటూ ఉన్నప్పటికి మాల-మాదిగల మధ్య వర్గసంఘర్షణను పెంచుతోందా? తగ్గిస్తోందా అని ఆలోచించాల్సిన విషయం. దళిత సాహిత్య పరిధి ఏమిటి అనేది కూడా తేలాల్సిన అంశమే. దళితసాహిత్యంలో దళితులు, దళిత బహజనులు వంటి పారిభాషిక పదాలను ప్రయోగించేటప్పుడు రాజకీయంగా కాకుండా కులప్రభావాన్ని అనుసరించి అవగాహనతో ఉపయోగించవలసిన అవసరాన్ని గుర్తించాలి.