ప్రశ్న - సతీ సహగమనం సనాతన ధర్మంలో ఉందా?

జవాబు =సతీ_సహగమనం_సనాతన_ధర్మంలో_ఉందా ?

సతీ_సహగమనం_చరిత్ర


సతీ సహగమనం సతీ అంటే " పతివ్రత " లేదా " భార్య " అని అర్ధం . సహ అంటే " తో పాటుగా " అని అర్ధం . గమనం అంటే " కదలిక " లేదా " నడక " అని అర్ధం . సతీ_సహగమనం అంటే " భర్త చనిపోయిన స్త్రీ తమ భర్తని కాల్చే చితి మంటల్లో దూకి తమను తాము అగ్నికి ఆహుతి చేసుకోవడం " . ఇది మన దేశం లో రాజుల పాలనా సమయం లో ఆచరణలో ఉండేది . వేద - పురాణాల్లో సతీ సహగమనం : సతీ సహగమనం ఆచరించాలని గానీ , సతీ సహగమనం అనే పదం గానీ , దాని ఆనవాలు గానీ ఏ వేదములలో కూడా లేదు . >> మరి ఈ సతీ సహగమనం అనే సంప్రదాయాన్నీ సనాతన వైదిక ధర్మానికి ( హిందూ ధర్మానికి ) ఏ విధముగా అంటగట్టారు ? >> ఈ వేద భూమి పై , ఏ విధముగా ఇంతటి దురాచారం సంప్రదాయం గా మారింది ? ఈ ప్రశ్నలకు సమాధానలు దొరకాలి అంటే మన పురాణాలని మరియు దేశ చరిత్రను క్షుణ్ణంగా , లౌకికంగా చదవాలి . పురాణాలు ఎందుకు చదవలాంటే , మన పురాణాల్లో సతీ సహగమనానికి పోలిన సంఘటనలు నాక తెలసినవి రెండు ఉన్నాయి . ఒకటి శివ_పురాణం లో ఉంది , ఇంకోటి మహాభారతం లో ఉంది . కానీ అవి అందరు ఆచరించే సంప్రదాయం మాత్రం కాదు . ఆ సంఘటనలను అర్ధమయ్యేల వివరిస్తాను .శివ పురాణం ప్రకారం ( రుద్ర_సంహిత , సతీఖండము ) సతీదేవి బ్రహ్మ కుమారుడైన దక్ష_ప్రజాపతి కూతురు . ఈ సతీ అన్న పదం అక్కడ నుంచి వచ్చినది . సతీదేవి తన చిన్నతనం నుంచి శివుని పై అపారమైన భక్తి కలిగి ఉండేది . ఆ భక్తితోనే అమె శివుడుని అపారంగా ప్రేమిస్తుంది , వివాహం చేసుకుంటే శివుణ్ణి చేసుకుంటానని తండ్రి దగ్గర పట్టుబడుతుంది . కానీ తండ్రి దానికి అంగీకరించడు . దక్షుడుకి ( దక్ష_ప్రజాపతి ) శివుడు అంటే ఇష్టం ఉండదు , శివుణ్ణి ద్వేషించేవాడు . శరీరం పై బూడిద పూసుకుని , శ్మశానాల్లో తిరిగే వాడని దూషించేవాడు . అప్పుడు సతీదేవి ఆమె తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది . ఒకనాడు దక్షుడు యజ్ఞం చేయాలని అనుకుంటాడు . ఆ యజ్ఞం కోసం బ్రహ్మ , విష్ణు మరియు దేవతలను , ఋషులను ఆహ్వానిస్తాడు . కానీ సతీదేవి - శివుడుకి ఆహ్వానం ఇవ్వాడు. సతీదేవి యజ్ఞం దగ్గరకు వచ్చి తనకు మరియు తన భర్తకు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నిస్తుంది. అప్పుడు దక్షుడు శివుడుని అవమానిస్తూ మాట్లాడుతాడు . దేవతలందరి లో తన భర్తకి అవమానం జరగటం భరించలేక సతీదేవి ఆ యజ్ఞం లో దూకి అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. మహాభారతం లో : పాండురాజు కు ఇద్దరు భార్యలు . ఒకరు కుంతీదేవి , ఇంకోరు మాద్రిదేవి . ఒకనాడు పాండురాజు తన రెండవ భార్య అయిన మాద్రిదేవిని వెంట పెట్టుకొని వేటకు వెళ్తాడు . మాద్రిదేవి ఒక మాయ లేడీని చూసి కావాలని కోరుతుంది . పాండురాజు దానికి బాణం వేస్తాడు . కానీ ఆ మాయ లేడీ రూపం లో ఉన్నది కిండమ ఋషి . అప్పుడు కిండమ ఋషి పాండురాజును దాంపత్య సుఖం పొందితే చనిపోతావని శపిస్తాడు .ఒక రోజు పాండురాజు తన శాపం విషయం మరచి , మాద్రి పట్ల ఆకర్షితుడై వారు శారీరకంగా దగ్గరవ్వగా , ఋషి శాప ఫలితంగా వెంటనే పాండురాజు మరణిస్తాడు . అయితే మాద్రి వల్లే పాండురాజు కి మరణం సంభవించిందని భావించి , మాద్రి కూడా పాండురాజు తో పాటుగా చితి లోకి ప్రవేశిస్తుంది. 1)చరిత్రలో సతి సహగమనం : పూర్వ కాలం రాజుల పాలన సమయం లో దండయాత్రలు జరిగేవి. ప్రత్యర్ధి రాజును ఓడించిన తరవాత వాళ్ళ భార్యని వశపరచుకొనే వారు. మహమ్మదీయులు పాలన సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరిగాయి అని చరిత్ర చెబుతుంది. చాలా మంది మహా రాణులకు అది నచ్చక తమకు తాముగా వారి భర్త యొక్క చితి మంటల్లోకి స్వయంగా వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యేవారు . దేశవ్యాప్తంగా క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఎక్కువగా ఉండేది . ఉత్తర భారతదేశంలో రాజపుత్ర సామ్రాజ్యాల్లోను మరియు దక్షిణ భారతదేశంలో కళింగ సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యంలోను కూడా ఈ పద్ధతి అమలులో వుండేది. కొన్నాళ్ళకి ఇది ఒక ఆచారణగా మారిపోయింది. మరి కొన్నాళ్ళకి భార్యకి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా చితి మంటల్లోకి తోయడంలాంటివి జరిగాయి. సమాజంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ దురాచారాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. 1818 వ సంవత్సరం లో సంఘ సంస్కర్త రాజా_రామ్మోహన్_రాయ్ గారు ఆత్మీయ సభా అను సంస్థను స్థాపించి, సమాజంలో జరిగే దురాచారాల పై పోరాటం చేశారు. వితంతు పునర్వివాహానికి కూడా చాలా కృషి చేశారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు. 1829 వ సంవత్సరంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్_ప్రభుత్వం సతీ సహగమనం చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దురాచారం ఆగిపోయింది. కానీ ఇప్పటికీ కూడా భర్త పై అపారమైన ప్రేమాప్యాయతలు కలిగిన వారు స్వయంగా తమకు తాము అగ్నికి ఆహుతి చేసుకొంటున్నారు. ఈ నాటికి ఏంతో మంది అపవాదులు ఈ సతీ సహగమనం అనేది సనాతన_ధర్మంలో ఒక సంప్రదాయమని అనేవాళ్ళు లేకపోలేదు, వారికి తెలియజేప్పడం కోసమే ఈ నా ప్రయత్నం.

  • "మన దేశ ఔన్నత్యాన్ని తెలుసుకుందాం"
  • దేశ_సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం."
  • జై శ్రీ రామ్
  • జై హింద్.
  1. Nikhil_Akkenapally