వాడుకరి:Nskjnv/ప్రయోగశాల

(వాడుకరి:Nskjnv.indicwiki/ప్రయోగశాల నుండి దారిమార్పు చెందింది)

నైతిక విద్య

మార్చు

పాఠశాల అందించే అంశాలు ప్రత్యక్ష పరోక్ష పద్దతుల్లో వివిధ రకాలుగా అంటే నియమాలు, బహుమానాలు, శిక్షణలు, నిబంధనలు, మర్యాదలు, సంబంధాలు, శైలి మొదలైన వాటికి కళారూపాలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక అంశాలు సమిష్టి వనుల ద్వారా అందచేయడం జరుగుతుంది. అలాంటి అనేక పద్ధతుల ద్వారా పిల్లల్లో నైతిక ప్రవర్తన, విలువలను, సామాజిక సందర్భానికి తగిన విధంగా పాఠశాల శిక్షణ ఉంటుంది. ఇది అంతటా వివిధ స్థాయిలలో విస్తరించి ఉంటుంది. దీనిని నైతిక విద్యగా పేర్కొంటాం.

నీతిశాస్త్రం

మార్చు

సమాజంలోని వివిధ మానవ సమూహాల ఉమ్మడి ప్రవర్తన, స్వభావం వివరించే ప్రామాణికశాస్త్రంగా నీతిశాస్త్రం నిర్వర్తించి క్రమవద్ధతిలో అభివృద్ధి చేయబడిన జ్ఞానంగా గుర్తించబడింది. అందువల్ల నీతి శాస్త్రంలో వివరించిన అంశాలు కేవలం ఒక భాగానికి , ప్రాంతానికి, సమాజానికి, వ్యక్తులకు మాత్రమే కాకుండా స్థల, కాలాదులతో సంబంధంలేని సర్వకాలీనతను కలిగి ఉంటుంది.

ఈక్రమంలో మానసిక శాస్త్రజ్ఞులు తెలియచేసిన కోరిక, ఉద్దేశ్యం, ఇష్టం, అభిప్రాయం వంటి మానసిక ప్రక్రియల స్వభావం, ప్రవత్తిని పరిశీలించడం ద్వారా నీతిశాస్త్రం అభివృద్ధి చెందింది. 'ఎథిక్స్' అనే‌ మాట గ్రీకుపదం ఎథికా నుండి ఉద్భవించింది . ఈథోస్ అంటే ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, ఉపయోగాలు, అలవాట్లుగా చెప్పవచ్చు . [1]

విలువల విద్య పరిధి

మార్చు

మానవుడు సంఘజీవే కాదు, అరిస్టాటిల్ అన్నట్లు నైతిక జీవి కూడా . అరిస్టాటిల్ తన 'వికోమడియన్ ఎథిక్స్' గ్రంథంలో అలోచిన్తూ గడిపే జీవితమే అత్యుత్తమమైన జీవితం అని, నాగరిక విలువలతో జీవించే మనిషే మంచి మనిషి అని అన్నాడు.

సమాజ సంస్కృతి విలువల ద్వారా ప్రతిబింబిస్తుంది.

  • విద్యాలక్ష్యాలే విద్యా విలువలు - కన్నింగ్ హోమ్
  • మనుషుల జీవితాదర్శలే విలువలు - ఎ.కె. సి. బట్టావే
  • వ్యక్తులు అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే విలువలు - హెచ్.ఎం.జాన్సన్
  • మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని గుర్తించునవి విలువలు - చార్లెస్ మోరిస్

నైతిక కోణం నుంచి చూస్తే, మనిషి ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ప్రదర్శించే నిజాయితీనే విలువ అంటారు. సర్వకాలాల సర్వావస్థల్లో ఉండగలిగే విలువలు నిరపేక్ష విలువలు, కాలంతో, ప్రాంతంతో, స్థితి గతులతో ప్రమేయం లేకుండా నిరపేక్ష, శాశ్వత, సార్వజనీన విలువలు సత్యం, శివం, సుందరం.

NskJnv 10:22, 21 నవంబరు 2022 (UTC)

మూలాలు

మార్చు
  1. వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెస్సింగ్ సెక్రటరీ. yes & yes publications. 2019.