వాడుకరి:PAJJURU RAVI TEJA/ప్రయోగశాల


మాజీ ప్రదాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 1991 మే 21 వ తేదిన హత్య గావించాబడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మే 20 మధాహ్న సమయములొ బయలుదేరి భువనేశ్వర్ మీదుగా, ఆంధ్రాప్రదేశ్ లోని కొన్ని నియొజకవర్గలలో పర్యటించారు.

ఆయన పర్యటనకు వినియొగిస్తున్న విమానంలొ సాంకేతిక సమస్య తలెత్తినప్పటికి చివరికి మరమత్తులు చేయించి సాయంత్రం 6.30ని,, వైజాగ్ నుంచి బయలుదేరి చెన్నై చేరుకొన్నారు. సాయంత్రం 8.30ని,,లకు స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మరకతం చంద్రశేఖర్ గారితో కలసి గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ (GWT) రోడ్దు ఆలయప్రాంగణములో ఉన్న సభాప్రాంగణానికి చేరుకున్నారు.


విపరీతంగా వచ్చిన జనాన్ని కేంద్ర ,రాష్ట్ర భద్రతా బలగాలు వి.ఐ.పి లను కట్టుదిట్టమైన భద్రత ద్వార ఆయన్ని కలవటానికి అనుమతించారు.అయినప్పటికి రాజీవ్ గాంధీకి తన కూతురు పాట వినిపించాలని వచ్చిన ,మరకతం చంద్రశేఖర్ కూతురు దగ్గర పని చేసే లతకణ్ణన్ అనుమతి పొందిన వారితో పాటుగాథాను,శివరాజన్,హరిబాబులు(దర్యప్తులొ ముఖ్యమైన ముద్దాయిలు గుర్తించబడ్డారు) కూడా వెళ్ళారు.థాను రాజీవ్ గాంధీ కాళ్ళకు నమస్కారం చేయటానికి వంగి తన నడుముకు ఉన్న RDX ప్రయోగించింది.ఆ విధంగా రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు.

ఈ చర్య విచరణ జరపడానికి డి.ఆర్.కార్తికేయన్ (ఐ.పి.ఎస్.) గారి అధ్యక్షతన సిట్(Special Investigation Team)ను ఏర్పాటు చేశారు.ఈ కమిటి తన విచరణ హరిబాబు(ముద్దాయిలలొ ఒకడు) తీసిన ఫొటొలు ఆధారంగా విచరణ ప్రారంభించారు.

ఈ దర్యాప్తు బృంద విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వామ్యులు అందరు LTTE (Liberation Tigers Of Tamil Eelam)కు చెందిన వారుగా గుర్తించింది.అంతేకాక వీరిలో కొందరి దగ్గర దొరికిన సమాచరం ప్రకారం వీరంత రాజీవ్ గాంధీ మీద విపరీతమైన ఆవేశంతో ఉన్నారు.

దినికి కారణం శ్రీలంక భద్రత విషయములొ జొక్యం చేసుకొని LTTE పై విరుచుకుపడ్డారు.అంతేకాక డి.ఎమ్.కె (DMK) పార్టి LTTE సహయపడుతుంది అని ఆ పార్టి అధికరాన్ని రద్దు చేసి రాస్ట్రపతి పాలన విధించడం.అతి ముఖ్యమైన కారణం రాజివ్ గాంధీ మరల అధికారంలోకి వచ్చి మరల ప్రధానమంత్రి అవటం దాదాపు ఖరార్ అవ్వటం.మరల ఆయన ప్రధాని అయితే LTTE మనుగడ కష్టమని భావించడము. వీరు ముఖ్య ముద్దాయిలు శివరాజన్ ,శుభలను వీరు ప్రాణాలతో పట్టుకొనలేకపోయారు.


ఈ కేసును సుప్రీం కోర్ట్ ధర్మాసనం న్యాయమూర్తులు కె.పిథమస్ ,ది.పి.వాధ్వా ,సయ్యద్ షా మొహమ్మద్ ఖ్వాద్రిల ఆధ్వర్యంలో నాలుగు మాసాలు చర్చ అనంతరం 1995 మే 5 న తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు ఉరి శిక్ష ,మరి కొందరిని జీవిత ఖైదు విధిస్తు ఇది ఉగ్రవాద చర్య కాదు అని అభిప్రాయపడింది.


                                                            మూలం: నిప్పులాంటి నిజం(డి.ఆర్.కార్తికేయన్)