పెద్ది రమాదేవి గారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, వీరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయుర్వేదం గురించి,ఆహారపు అలవాట్ల గురించి, మన జీవనశైలి గురించి, ఆయుర్వేదం అంటే నాటు వైద్యం కాదు ,ఆయుర్వేదం ఒక శాస్త్రం అని మొట్టమొదటసారిగా ప్రజలకు అర్థం అయ్యే విధంగా పేపర్ మరియూ టీవీ లాంటి సాంకేతిక మీడియా ల ద్వారా కొన్నివేల కథనాలు, టీవీ షోలు వ్రాసిన ప్రధమ తెలుగు మహిళగా మనకు సుపరిచితులు.

పెద్ది రమాదేవి గారు గత 23 సంవత్సరాలుగా వివిధ మాద్యమాలద్వరా సహజ సిద్ధమైన ఆరోగ్య సూత్రాలను సామాన్య ప్రజలకు అర్థం అయ్యే విధంగా పేపర్ మరియూ ఇతర సాకెంతిక సాధనాలద్వార ప్రజలకూ అందేటట్లు అర్థం అయ్యే విధంగా అనేక వ్యాసాలు, టీవీ షోస్ ద్వారా తెలిపిన ప్రథమ మహిళ డా పెద్ది రమాదేవి గారు

ఈరోజుకి తెలుగు వారికీ ఆయుర్వేదం అనే ఒక సంస్కృత వైద్యాన్ని సులువుగా అర్థం అయ్యే విధంగా, మన రోజువారి జీవని శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా మనకు కలిగే లాభాలను కొన్ని వేల వ్యాసాలు ప్రముఖ దినపత్రికలు- ఈనాడు, వార్త, నమస్తే తెలంగాణ, సూర్యా, ఆంధ్రభూమి, అందరికీ ఆయుర్వేదం, డెక్కన్ క్రానికల్,వనిత లాంటి డైలీ న్యూస్ పేపర్లలో ప్రజలకు అందుబాటులో అగాహన అయేటట్లు వ్రాశారు

గత 22 సంవత్సరాలుగా ఈనాడు దినపత్రిక లో ఆరోగ్య పరమైన వ్యాసాలు రాస్తున్నారు, టీవి ఛానల్ లో ఆరోగ్యంగా ఉండడానికి టిప్స్,వైద్యం, చాట్ షోస్ నిర్వహించారు,వీరు తెలుగులో వస్తున్న టీవి చానల్స ఈనాడు, టేవి9, టీవీ 7 హెల్త్ planet, సప్తగిరి దూరదర్శన్ జాతీయ ఛానల్ లో, స్టూడియో ఎన్, వనితటీవీ, భక్తిటీవీ, ఎక్స్ప్రెస్ టీవీ, టివి1, మహాటీవీ, 99టీవీ లో ఆరోగ్య పరమైన అంశాల గురించి విస్తృతంగా ఫలాపేక్షలేకుండా సామాన్య ప్రజలకు అర్థం అయ్యే విధంగా చెప్పుకుంటూ వచ్చారు

డా పెద్ది రమాదేవి గారు వరంగల్ జిల్లాలో జన్మించారు,వీరి తాత ముత్తాతలు ఆయుర్వేద వైద్య నిపుణులు,వీరి కుటుంబం వైద్యం-విద్య నేపథ్యం తో కూడి ఉన్నందున ఆయుర్వేదం అనే వైద్యం ఆధునికంగా ఏ విధంగా ఆధునిక వైద్యంతో వాడుకోవచ్చు అనే విషయాల గురించి పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా, చాట్ షోస్ ద్వారా తెలపడం చేస్తున్నారు

డా పెద్ది రమాదేవి గారు 1964 లో వరంగల్ జిల్లాలో జన్మించారు, ప్రాథమిక విద్య ఫాతిమా గర్ల్స్ హైస్కూల్ కాజీపేట, గవర్నమెంట్ పింగళి కాలేజ్ వడ్డేపల్లిలో ఇంటర్మీడియేట్ ,అనంత లక్ష్మీ గవర్నమంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఏమ్మ్స్ BAMS-1987, డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మిన్స్త్రేషన్ DHA -1991 Vellore నుంచి పట్ట భద్రులు అయ్యారు

వీరు చేస్తున్న సేవలను గుర్తించి బెస్ట్ డాక్టర్ అవార్డ్ గ టీవీ 7 health planet వారు ప్రముఖ ఆయుర్వేద లుగా సన్మానించారు, తెలుగు రాష్ట్రాలలో సేవలు చేస్తున్న వివిధ వైద్యులలో వీరిని ఒక ప్రముఖ వైద్యులుగ డా నాయని నరసింహ రెడ్డి గారు, హై కోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా వీరు జ్యపికలు అందుకున్నారు

ఈరోజుకి వీరు దేశీయ వైద్యంలో వాడే వివిధ ఔషధాలు వాటి పనితరు, ఆధునికంగా ఎన్నివిధాలుగా మన ఆరోగ్యానికీ ఉపయోగ పడుతున్నాయి, ఆయుర్వేదంలో చెప్పిన వివిధ విషయాలను ఆధునికంగా ఉపయోంచడం గురించి పరిశోధన చేస్తున్నారు

వీరు గత 33 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యులుగా హైదరబాద్ లో వైద్య వృత్తిని కొన సాగిస్తున్నారు

1998లో వీరు సురక్ష ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ ని సంజీవరెడ్డి నగర్ లో స్థాపించారు.

అనేక మంది రోగులకు ఈ క్లినిక్ ద్వారా సేవలు అందిస్తూ వస్తున్నారు సాధారణ జీర్ణ సమస్య నుండి సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను వీరు నయం చేస్తూ వస్తున్నారు.

ఒక రోగాన్ని తగ్గించడమే కాకుండ ఆహరం విహారం, మరియూ మానిసికంగ వ్యాధులు తగ్గించుకునే సులువైన సలహాలు సూచనలు వీరు అందిస్తున్నారు

వీరు సాధారణ జీవితం గడుపుతూ మీడియా, వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు

వీరి కుటుంబ విషయానికి వస్తే వీరు 1988సంవత్సరంలో శ్రీ పెద్ది రాజేంద్ర క్రిష్ణ ప్రసాద్ గారితో వివాహం జరగింది, రాజేంద్ర క్రిష్ణ ప్రసాద్ గారు ఢిల్లీ యూనివ్సిటీలోని ఎంటెక్, మరియు ఎంబీఏ చేసి ఇండస్ట్రియల్ మారియు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గ పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు శ్రీ పెద్ది శ్రీనివాస శ్రీహర్ష బీటెక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ , CBA From ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB, ప్రస్తుతం OCTRAIN STUDIOS మరియు GetMyStrategy అనే startup ని నడుపుతున్నారు ఉద్యోగం చేస్తున్నారు.