వాడుకరి:Pavan santhosh.s/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాధాన్యతా క్రమం ప్రణాళిక

గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టు కోసం నిర్వాహకులు, మిషన్ క్లీన్ తెవికీ ప్రతిపాదన చేస్తున్న సభ్యులు కోరుకుంటున్న గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యతా క్రమ నిర్ధారణకు ఒక ప్రణాళిక ఇది. దీన్ని అనుసరించి సముదాయ సభ్యులు ఇంత అని నిర్ధారించుకున్న సమయంలో, ఎన్ని వ్యాసాలను అభివృద్ధి చేయగలరో ప్రణాళిక వేసుకుని అత్యంత ప్రాధాన్యత కలవి, ప్రాధాన్యత కలవి, ప్రాధాన్యత లేనివి, తెవికీలో ఉండదగనివి అన్న విస్తృతమైన వర్గీకరణలోకి, ప్రస్తుతం ప్రాజెక్టు సభ్యులు సమిష్టిగా కృషిచేస్తున్నవి తేవచ్చు. అలానే వాటిలో ముందు తొలగించవలసినవి ఏమిటో, అభివృద్ధి చేయాల్సిన వాటిలో ముందు అభివృద్ధి చేయదగినవి ఏమిటో ఓ ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించుకుని చేయవచ్చు.

ఆలోచన

మార్చు

ఈ ప్రాధాన్యతలు నిర్ధారించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వికీపీడియన్లు రానున్న ఇన్ని నెలల్లో ముందు తొలగించవలసినవి ఏమిటో, ముందు అభివృద్ధి చేయదగ్గవి ఏమిటో ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారిస్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని తొలగింపులు, అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాధాన్యత క్రమాన్ని ఓ సుస్పష్టమైన పద్ధతిలో కొన్ని సూచనల వంటి ప్రమాణాల ఉపయోగించుకుని విచక్షణ మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వికీపీడియన్లు నిర్ధారించవచ్చు.

ప్రణాళిక

మార్చు
  1. కనీసం ఐదుగురు వికీపీడియన్లు పాల్గొనే ఈ ప్రక్రియలో నేను ప్రస్తుతానికి 2 నెలలను యూనిట్ గా స్వీకరిస్తున్నాను, దీన్ని మార్చవచ్చు
  2. అలానే ప్రతి వికీపీడియన్ వద్ద 60 పాజిటివ్ పాయింట్లు, 60 నెగెటివ్ పాయింట్లు వ్యాసాలకు కేటాయించడానికి ఉంటాయి.
  3. ఆయా పాయింట్లను సూచనా మాత్రంగా ఉన్న ప్రాధాన్యత ప్రమాణాలను తమ విచక్షణ మేరకు అన్వయించుకుని తీసేయాలని భావించిన వ్యాసాలకు నెగెటివ్ పాయింట్లు, అభివృద్ధి చేయదగ్గవి అన్న వ్యాసాలకు పాజిటివ్ పాయింట్లు కేటాయించవచ్చు.
  4. అయితే ఒక్కో వ్యాసానికి నెగెటివ్ పాయింట్లు కానీ, పాజిటివ్ పాయింట్లు కానీ గరిష్టంగా 6, కనిష్టంగా 3 మధ్యలోనే కేటాయించాల్సి వుంటుంది.
  5. ఆ రకంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించిన వ్యాసాలను లిస్టు చేసి ఇటు అభివృద్ధి చేయదగిన వ్యాసాలను ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారు అభివృద్ధి చేయవచ్చు (వారు ఇలాంటి లిస్టు కోసమే కోరుతున్నారు), అలానే తీసేయదగ్గవిగా నిర్ధారణ అయిన వ్యాసాలను తొలగిస్తూ పోవచ్చు.

సూచించే ప్రమాణాలు

మార్చు

ఈ కింది ప్రమాణాలు కేవలం సూచనలు వంటివి, వీటిని విషయ ప్రాధాన్యతలో ఉపయోగించుకోవచ్చు. లేదంటే వీటితో పాటు మరేదైనా ఆయా వికీపీడియన్ లాజికల్ గా సరైనవని భావిస్తే విచక్షణ మేరకు దాన్ని కూడా వాడవచ్చు.

  • విషయ ప్రాధాన్యత
  • ఆంగ్ల (మూల) వ్యాస నాణ్యత (అనువదించదగ్గ వాటికే)
  • తెలుగు రిఫరెన్సులతో మరింత విస్తరించగల అవకాశం
  • తెలుగు పాఠకుల ఆసక్తి
  • ఫోటోల లభ్యత

తీసేసేప్పుడు ప్రత్యేకించి ఆయా వ్యాసాలు తెలుగు వికీపీడియా విషయ ప్రాధాన్యతలో ఎక్కడో వెనుకబడి వుండడం, నోటబుల్ కాకపోవడం, ఆంగ్లంలోనే అరకొర సమాచారం ఉండడం, తెలుగు పాఠకుల ఆసక్తికి దూరంగా ఉన్నాయని భావించడం వంటివి ఉండవచ్చు.

ఒక ప్రత్యేకమైన పట్టికలో ఆయా వ్యాసాల ప్రాధాన్యతాప్రాధన్యతలు నిర్ధారించగానే ముందుగా తయారుచేసుకున్న మూస చేరుస్తూ ప్రాధాన్యం అన్నదానిలో దాని స్కోరు/స్థితి రాసేస్తాం. మూసలో ఉన్న విధంగా కింద వ్యాసం వర్గీకరణ చెందుతుంది. పైన అనుకున్న విధంగా వర్గాన్ని ఉపయోగించుకునే అభివృద్ధి, తొలగింపు సమన్వయం చేసుకోవచ్చు. అభివృద్ధి ప్రారంభించగానే చర్చ పేజీలోని మూసలో స్థితి అప్ డేట్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా అయిపోయాకా శుద్ధి అయిన విషయాన్ని సూచించవచ్చు.

ముందుగా చేయవలసినవి

మార్చు
  1. పైన చెప్పిన విధంగా ఎన్ని నెలల ప్రాధాన్యత మనం పెట్టుకుంటే అన్ని నెలలను సూచిస్తూ ప్రాధాన్యత క్రమం నిర్దేశం పేజీని శుద్ధి ప్రాజెక్టు నేంస్పేసులో తయారుచేసుకోవాల్సి ఉండొచ్చు.
  2. అలానే పైన ప్రతిపాదించిన మేరకు ప్రాజెక్టు మూసను - ప్రాధాన్యం, స్థితి రాసుకోదగ్గ ఉప విభాగాలతో తయారీ.