వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/సుజాత గారి ఇంటర్వ్యూ

వివరాలు

మార్చు
  • జననం : ఒంగోలు, 1956
  • తల్లిదండ్రులు : తండ్రి - చిరు వ్యాపారి, తల్లి - గృహిణి (చదువుకోలేదు)
  • వివాహం: 1974
  • నివాసం: తమిళనాడు, కంచి జిల్లాలో, కుంజివాకం
  • పుస్తకాలు చదవడం చాలా ఇష్టం, చదవకుండా ఉండలేని స్థితి. కథా సాహిత్యం, నవలా సాహిత్యం చదివాను. అందుబాటు తక్కువ ఉండేవి అందుకు ఇబ్బంది.
  • ఆంగ్ల భాషా పరిజ్ఞానం: పిల్లలు ఎదుగుతున్న సమయంలోనే అభివృద్ధి చేసుకున్నాను. 200 పైన ఆంగ్ల నవలలు చదివాను. భాషను అభివృద్ధి చేసుకునేందుకు సాహిత్యాన్ని ఉపకరణంగా తీసుకున్నాను.
  • వికీపీడియా: అమ్మాయి వివాహం అయ్యాకా, 1999లో అమ్మాయికి పెళ్ళి అయింది. డిసెంబరులో అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. చాటింగ్ చేయడానికి కంప్యూటర్ కొనుక్కున్నాం. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చాలా ఎక్కువ. అందుకని కంప్యూటర్ ఆపరేటింగ్ పూర్తిస్థాయిలో నేర్చుకున్నాను. త్వరగానే వచ్చింది. చాటింగ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ తీసుకున్నాం. చిన్నతనం నుంచి జికె ఆసక్తి ఎక్కువ. ఆ నేపథ్యంలో ఇంటర్నెట్లో జనరల్ నాలెడ్జ్ అంశాలు వెతికాను, వెతుకుతూ వికీపీడియాకు చేరుకున్నాను. చూసీ చూడగానే తెవికీలో వ్యాసాలు తక్కువ ఉండేవి. త్వరగానే నేను తెలుగు వికీపీడియాలో రాయవచ్చు అని తెలుసుకుని ఒక్కోటీ నేర్చుకుని రాయడం ప్రారంభించాను.
  • ఏయే రకమైన వ్యాసాలు: మా అమ్మాయి లాస్ ఏంజెలిస్ లో ఉండగా లాస్ ఏంజెలిస్ గురించి, ఇతర అమెరికా నగరాల గురించి ఓ లక్ష్యం కోసం ప్రారంభించాను. భారతదేశంలో వివిధ ప్రదేశాలు పర్యటించాను. వాటి గురించి ముందుగా తెలుసుకున్న వివరాలు మూలాలతో తెవికీలో రాస్తూ వచ్చాను. మహా భారతాన్ని సంగ్రహంగా తెవికీలో రాయడానికి దాదాపు సంవత్సరం పట్టింది. జ్యోతిష్యాంశాల గురించీ రాశాను. భారతదేశంలోని జిల్లాలన్నిటి గురించి ఆంగ్ల వ్యాసాల నుంచి అనువాదాలు చేశాను. ప్రపంచ దేశాల గురించి రాసే ప్రాజెక్టు కొనసాగిస్తూన్నాను.
  • వికీపీడియన్లు అందరూ నాకు ప్రోత్సాహం అందించడం చాలా సంతృప్తికరమైన అంశం. నా కృషి వల్ల వ్యాసాల సంఖ్య, నాణ్యత పెరగడం చాలా సంతృప్తికరంగా ఉంది. ఇదంతా తెవికీపీడియన్ల సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది. మరింతమంది పెరగాల్సిన అవసరం ఉంది.
  • బొంబాయిలో జరిగిన వికీపీడియా సమావేశంలో దేశం మొత్తం మీద 11 మందికి గుర్తించదగ్గ వికీపీడియన్ (నోట్ వర్దీ వికీపీడియన్) ఇవ్వగా నేనొకదాన్ని. కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ అవార్డు - 2014, ఉగాది ఉత్సవాలు - 2013 -కార్యదర్శి, 11వ వార్షికోత్సవాలకు ఉపాధ్యక్ష పదవి చేపట్టారు.
  • మహిళలు ఎక్కువమంది వస్తే బావుంటుంది. సమయం సర్దుబాటు చేసుకోవడం వారికి పెద్ద సమస్యే. అంతర్జాలం, ఆసక్తి అవసరం.
  • భార్యాభర్తలు ఇద్దరూ వికీపీడియన్లు కావడంతో, తీరిక సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పదిమందికీ పనికొచ్చే పనిచేయడం సంతోషకరం.


ఆవిడ వయసు ఆరుపదులు దాటింది, చదువు స్కూల్ ఫైనల్, ఉండేది తమిళనాట, గృహిణిగానే తన జీవితాన్ని గడిపారు. ఐతేనేం కంప్యూటర్లో ఓనమాలు దిద్దుకుని తెలుగు వికీపీడియాలో వేలాది వ్యాసాలు రాశారు. 44 వేలకు పైగా మార్పులు చేర్పులతో తెలుగు వికీపీడియాలో అత్యధిక కృషి చేసిన మహిళగా నిలిచారు. చదువుని, పరిస్థితుల్ని, వయసునీ తిట్టుకుంటూ కూర్చునే అవకాశం ఉన్నా అందుకు బదులు ఆవిడ తన స్వయంకృషినే నమ్ముకున్నారు. 2000లోనే వయసు మీరిన వారికి కంప్యూటర్ కీకారణ్యం కాదని నమ్మారు. ఆవిడ పేరు సుజాత, పట్టుదల, కృషి పర్యాయపదాలు.

తెలుగు వికీపీడియా అన్నది పుస్తకాలు, జర్నల్స్ వంటివి మూలాలుగా తీసుకుని ఎవరైనా అభివృద్ధి చేయదగ్గ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ వ్యాసాలను ఒక్కరే రాయడం కాకుండా పదిమందీ కలిసి సమిష్టిగా కృషిచేసే పద్ధతిలో రాస్తారు. అలానే రాసిన వ్యాసానికి హక్కులు తాము ఉంచుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉపకరించేలా వదిలేస్తారు. అలాంటి మాధ్యమాన్ని తీసుకుని ఆమె కృషిని కొనసాగించారు. ఈనాడు తెలుగు వికీపీడియాలోనే కాక భారతీయ భాషల వికీపీడియాల్లో కూడా సుపరిచితమైన పేర్లలో ఆవిడది ఒకటి. అలాంటి సుజాత గారి స్ఫూర్తి గాధ ఇది:

సుజాత స్వస్థలం నెల్లూరు. ఆవిడ తండ్రి చిన్న చిల్లరకొట్టు వ్యాపారి కాగా, తల్లి సామాన్యమైన గృహిణి. 1954లో జన్మించిన సుజాత స్కూలుఫైనల్ వరకూ చదువుకుని ఆపైన చదువుకు స్వస్తిచెప్పి వివాహం చేసుకున్నారు. శ్రీరామమూర్తిత వివాహం అయ్యాకా ఆవిడ తమిళనాడులోని కంచి జిల్లాలో కుంజివాకం అనే గ్రామానికి భర్తతో పాటు వెళ్ళారు. మొదటి నుంచీ సాహిత్యం అంటే ఆసక్తి ఉండడంతో నవలా సాహిత్యం, కథా సాహిత్యం బాగా చదువుకున్నారు. పైగా తమిళ ప్రాంతంలో ఉండడంతో తెలుగు భాష, సంస్కృతుల పట్ల అభిమానం ఎక్కువగా ఉండేది. గృహిణిగా ఉండీ ఆంగ్లం నేర్చుకోవాలన్న ఆసక్తితో ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు. పట్టుదలతో దాదాపు 200 పైగా ఆంగ్ల నవలలు సొంతంగా చదువుకుని ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని అలవరుచుకున్నారు.

1999లో కూతురి వివాహమై అల్లుడితో అమెరికా నివాసం వెళ్ళారు. ఆ సమయంలో కుమార్తెతో చాటింగ్ చేసేందుకు తొలిసారిగా కంప్యూటర్ కొనుక్కుని, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకున్నారు. కంప్యూటర్ కొన్న కొద్ది సమయంలోనే స్వంత ఆసక్తి, కృషి మీద 50 సంవత్సరాల వయసులో కంప్యూటర్ లోతుపాతులు తెలుసుకోగలిగారు. తనకు జికె అంశాలపై ఉన్న ఆసక్తితో ఆంగ్ల వికీపీడియాలో ఆయా అంశాలు వెతికి చదవడం మొదలుకొని, తెలుగు వికీపీడియాను చదవడం అలవరుచుకున్నారు. ఆ క్రమంలో 2006లో తొలిసారి తెలుగు వికీపీడియాలో రాయడం ప్రారంభించారు.

2006 నుంచి ఆవిడ తెవికీలో అవిరళ కృషి కొనసాగుతూ వచ్చింది. మొదట అమెరికాలో వారి కుమార్తె, ఇతర బంధువులు నివసించిన నగరాల గురించి తెలుసుకుని తెలుగులో రాయడం ప్రారంభించిన ఆవిడ, క్రమంగా తన ఆసక్తుల మేరకు కృషిని విస్తరించారు. పర్యటనలపై ఆసక్తి ఉండడంతో భారతదేశ వ్యాప్తంగా పర్యటించిన ప్రతి ప్రదేశాన్ని గురించి తెవికీలో వ్యాసాలు అభివృద్ధి చేశారు. ఆపైన భారతదేశంలోని ప్రతి జిల్లా గురించి ప్రత్యేకించి వ్యాసం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి భారతదేశంలోని జిల్లాలు అన్న ప్రాజెక్టు నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలోని ప్రతి జిల్లా గురించి వ్యాసాన్ని సృష్టించి అభివృద్ధి చేశారు. అది పూర్తయ్యాకా ప్రపంచ దేశాల గురించిన వ్యాసాలు పూర్తచేసే కృషిలో ప్రస్తుతం ఉన్నారు.

సుజాత తన ఆంగ్ల, తెలుగు పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆంగ్ల వికీపీడియాలో మంచి వ్యాసాలను ఎన్నిటినో తెలుగులోకి అనువదిస్తూంటారు. వికీపీడియా అభివృద్ధి కోసం అంతర్జాలంలో పనిచేయడమే కాక అంతర్జాలం బయట కూడా తన కృషిని వెచ్చించారు. తెలుగు వికీపీడియా సముదాయం 2013లో ఉగాది ఉత్సవాలను, 2014లో దశాబ్ది ఉత్సవాల వేడుకలు, 2014లో 11 వార్షికోత్సవాలు నిర్వహించినప్పుడు నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఉగాది ఉత్సవాలకు కార్యదర్శిగానూ, 11వ వార్షికోత్సవానికి ఉపాధ్యక్ష బాధ్యత చేపట్టారు.

సుజాత భర్త శ్రీరామమూర్తి కూడా తెలుగు వికీపీడియా, వికీసోర్సుల అభివృద్ధి కోసం స్వచ్ఛంద రచయితగా కృషిచేయడం విశేషం. తెలుగు వికీపీడియాకు ఆమె చేసిన కృషికి గాను కొమర్రాజు లక్ష్మణరావు ఉత్తమ వికీపీడియన్ - 2014 పురస్కారాన్ని పొందారు. 2011లో భారతదేశంలో నోట్ వర్దీ వికీపీడియన్ గా దేశవ్యాప్త గుర్తింపు పొందారు.