వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/handbook
వికీపీడియా ఆలోచన వెనుక
మార్చు"Imagine a world in which every single human being can freely share in the sum of all knowledge. That’s our commitment."
"సమస్త విజ్ఞానాన్ని ప్రతీ మనిషీ స్వేచ్ఛగా పంచుకోగలిగే ఓ ప్రపంచాన్ని ఊహించండి. అదే మా ఆశయం"
ఇది వికీమీడియా ఫౌండేషన్ విజన్ స్టేట్మెంట్. వికీపీడియా వ్యవస్థాపకుల్లో ఒకడైన జిమ్మీ వేల్స్ మాట. వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల వెనుక ఈ ఆలోచనలో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. సమస్త విజ్ఞానం, ప్రతీ ఒక్కరూ పంచుకోగలగడం, స్వేచ్ఛగా వంటి అంశాలు దీనికి ఒక రూపాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఆశయం వికీపీడియాలోని ప్రతీ పాలసీలోనూ, ప్రతీ మార్గదర్శకంలోనూ ప్రతిఫలించాలి, చాలావరకూ ప్రతిఫలిస్తాయి కూడా. ఎవరైనా ఈ ఆలోచనను మనస్సులో ఉంచుకుని వికీపీడియాలోని విధానాలను, పద్ధతులను, నిర్మాణాన్ని పరిశీలిస్తే అంతా ఒక క్రమంలో కనిపిస్తుంది. లేకపోతే ఆ క్రమం కనిపించదు సరికదా తప్పుగా కూడా కనిపించవచ్చు.
ఉదాహరణ
మార్చువికీపీడియా పరిధి అన్నది విజ్ఞాన సర్వస్వ వ్యాసాలకు పరిమితమవుతుంది. దానిలో నేరుగా పుస్తకాలు, డాక్యుమెంట్లు పెట్టడానికి అవకాశం ఉండదు. ఐతే ప్రపంచంలోని సమస్త విజ్ఞానం కేవలం వ్యాసాల రూపంలోకే తీసుకురాగలమా అని సందేహం వచ్చి స్వేచ్ఛగా పంచుకోగలిగే పుస్తకాల కోసం వికీసోర్సు ప్రారంభించారు. అలానే ప్రపంచంలోని ప్రతీ మనిషీ విజ్ఞానం అందుకోవాలంటే కొన్ని భాషల్లోనే ఉంటే సాధ్యమా అని ఇన్ని భాషల వికీపీడియాలు రూపుదిద్దుకున్నాయి.
ఎక్కడ ఉపయోగపడుతుంది
మార్చుఏదైనా విధానం ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలన్నా, ఏదైనా చర్చలో వికీపీడియా స్ఫూర్తి ఏమిటన్నది వాడివేడి చర్చల్లో మర్చిపోతున్నా ఈ మౌలిక లక్ష్యం గుర్తుచేసుకుని చేస్తున్న పని దానికి తోడ్పడుతోందా? దెబ్బతీస్తోందా అన్నది గుర్తిస్తే చాలా ఉపకరిస్తుంది.