వాడుకరి:Pavan santhosh.s/సముదాయంతో సంప్రదింపులు

సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ గా పవన్ సంతోష్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా సముదాయంతో సంప్రదింపులు అనే అంశాన్ని స్వయంగా ఇలా ఆన్-వికీ పేజీగా తీసుకువచ్చారు. ఈ పేజీల్లో వికీపీడియన్లతో వ్యక్తిగతంగానూ, టెలీఫోన్ లోనూ, మెయిల్స్ లోనూ మాట్లాడిన సంభాషణలు ప్రచురిస్తున్నాను. అయితే అలా ప్రచురించేందుకు సంభాషణకు ముందే వికీమీడియన్లకు తెలియజేసి అనుమతి స్వీకరించి చేస్తున్నువే తప్ప వారి వ్యక్తిస్వేచ్ఛకు భంగం కలిగించే పనిచేయట్లేదని మనవి. ఇక్కడ తాము వెల్లడించినదానికి రేఖామాత్రం భిన్నంగా ఉందని అనిపించినా ఆయా వికీపీడియన్లు తప్పక చర్చ పేజీ సందర్శించి అక్కడ రాయవలసిందని మనవి. అలానే ఆయా వికీపీడియన్లు వీలుచేసుకుని చదివి, ఇతర అభ్యంతరాలు లేకుంటే ఆమోదం సెక్షన్ కింద ఆమోదించాలని కోరుతున్నాను.

రాజశేఖర్ గారు మార్చు

ప్రస్తుత ప్రణాళిక గురించి మార్చు

వికీసోర్సు
  1. తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదల - అమ్మనుడి, నడుస్తున్న చరిత్ర ఏ స్థితిలో ఉందని ప్రశ్నించగా పవన్ సంతోష్ ఓటీఆరెస్ పని జరుగుతోందని సమాధానం ఇచ్చారు. మండలి బుద్ధప్రసాద్ గారి పుస్తకాల విడుదలకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని, వాటిలో ముఖ్యమైనవి సోర్సులో చేర్చే పని పురోగతిలో పెట్టాలని చెప్పారు.
  2. అన్నమాచార్య సంకీర్తన ప్రాజెక్టు - సంకీర్తనలన్నీ సీఐఎస్-ఎ2కె వారి వద్ద ఉండివుంటే రాజశేఖర్ గారికి ఇవ్వవచ్చు. ఇస్తే వాటిని సోర్సులో చేర్చే ప్రయత్నాలు ప్రారంభించడానికి సంసిద్ధమే.
  3. వీరేశలింగం ప్రాజెక్టు - వీరేశలింగం ప్రాజెక్టుకు కొనసాగాలని ఐతే అది ఇక స్వచ్ఛందంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచే కృషి సాగితే బావుంటుందని అవసరమైతే తానూ (రాజశేఖర్ గారు), అర్జున గారూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. (ఆన్-వికీలో ఇక్కడ చూడొచ్చు)
వికీపీడియా
  1. సంస్థాగత భాగస్వామ్యాలు: ఆంధ్రా లయోలా కళాశాలతో భాగస్వామ్యం అంతగా విజయవంతం కాకపోవడానికి కారణం సముదాయంతో వారిని లింక్ చేయకపోవడమేనని అభిప్రాయపడ్డారు. సముదాయ సభ్యులకూ, విద్యార్థులు-ఉపాధ్యాయులను మరింత సమర్థంగా లింక్ చేయగలిగితే, వారూ వీరూ ఫోన్ చేసి మాట్లాడుకోగలిగే స్థితి కల్పించివుంటే విజయవంతం అవునని పేర్కొన్నారు. సంస్థాగతమైన అంశాలు తనకు తెలియవని, వాటితో ఇబ్బందులు లేకుంటే లయోలా కళాశాల ప్రయత్నాన్ని వదలకూడదనిపిస్తోందని తెలిపారు. ఐతే విద్యార్థుల వాండలిజం, అవగాహన రాహిత్యం ఎదుర్కొనేలా, విద్యార్థులు ఐచ్ఛికమైన అంశాలపై రాసేందుకు వీలుండేలా ఏవైనా ప్రయత్నాలు చేస్తే బావుంటుందని సూచించారు.
  2. పట్టణాలూ, నగరాల్లో వికీపీడియా: ఈ అంశాన్ని ముందుకుతీసుకువెళ్ళాలని తెలిపారు.
  3. వాడుకరి అభిరుచి జట్టులు: వికీపీడియాకు ఉపకరించే అభిరుచులు ఉన్నవారిని కలుపుకుని ముందుకువెళ్ళాలని సూచన.
  4. వాడుకరులకు శిక్షణ: వ్యక్తిగతంగా కూడా కొందరు ఉత్సాహం, అనుభవం ఉన్న వాడుకరులకు వారు ఇప్పటివరకూ ప్రయత్నించని అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. తద్వారా తెవికీకి ఒనగూడే మేలు గురించి ఆశాభావం వ్యక్తంచేశారు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు స్థితుల్లో ఉండడంతో వీలుంటే వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వాలని, సమయాన్ని దీనిపై పెట్టుబడి పెడితే ప్రతిఫలం ఉంటుందని సూచించారు.
  5. కాపీరైట్ లైసెన్సులపై శిక్షణ: కాపీహక్కులపై శిక్షణ అవసరమైనది. ఓటీఆరెస్ కాపీహక్కులు వంటివాటిపై ప్రత్యేకించి శిక్షణ నిర్వహించాలి.
  6. తెలుగు కథారచయితల ప్రాజెక్టు: సీఐఎస్-ఎ2కె ప్రతినిధి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అందజేసినట్టు తనవద్ద ఉన్న సమాచారాన్ని పవన్ సంతోష్ వెల్లడించారు. అయితే రాజశేఖర్ ప్రాజెక్టు గురించి అనుకున్నప్పుడు సీఐఎస్-ఎ2కె ప్రతినిధులతో సముదాయం చర్చించింది వేరని, గూగుల్ డాక్యుమెంట్లలో సాంకేతికాంశాలు వినియోగించి సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ రహ్మానుద్దీన్ ఒక్కో రచయిత గురించి మౌలికంగా కథానిలయం వారిచ్చిన సమాచారాన్ని వికీ మార్కప్ కోడ్ తో ముద్రించగా వాటిని సముదాయ సభ్యులు చూసి, సరైన సమాచారం వచ్చిందని భావిస్తే వాటికి తమవద్ద ఉన్న మూలాల నుంచి ఇంకొంత చేర్చి తెచ్చి తెవికీలో ప్రచురించాలన్నది అసలు ప్రణాళిక అని తెలిపారు. అవసరమైతే ప్రతిసారి 50-100 వ్యాసాలను రహీం ప్రచురించేట్టు దాన్ని సముదాయ సభ్యులు తెవికీలో వ్యాసంగా చేసి, మొలక స్థాయి నుంచి దాటించాకానే మరొక 50-100 పని చూసేట్టు ప్రణాళిక వేసుకుంటే బావుంటుందన్నది చర్చల్లో తేలిన అంశం.
  7. వికీడేటా అవగాహన సదస్సు: ఇది భవిష్యత్తులో నిర్వహించనున్నట్టు ఆ కార్యక్రమానికి సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆపీసర్ రహ్మానుద్దీన్ ను ఆహ్వానించనున్నట్టు రాజశేఖర్ ప్రశ్నించగా పవన్ సంతోష్ తెలిపారు. ప్రస్తుతానికి వికీడేటాపై సాంకేతికంగా అవగాహన కలిగిన వీవెన్, సాంకేతికంగా ఉన్నతస్థాయిలో ఉండి ఇటీవల మీడియా వికీ ట్రైన్ ద ట్రైనర్ కు హాజరైన ప్రవీణ్ ఇళ్ళలను కూడా ఆహ్వానించనున్నామని సంతోష్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వికీడేటా అవగాహన సదస్సు అవసరమేనని అయితే బెంగళూరు నుంచి పి.వో. ప్రత్యేకించి రావడం కన్నా ఏదోక నెలవారీ సమావేశంలోనో, మరో ప్రత్యేక కార్యక్రమంలోనో ప్రవీణ్ ఇళ్ళ, వీవెన్ హాజరై నిర్వహిస్తేనే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తాను ఔత్సాహికునిగానూ, కృషిచేయడం ద్వారానూ వికీడేటా ఉపకరణాలను గురించి పొందిన అవగాహనను కూడా సభ్యులతో పంచుకుంటానని తెలిపారు.

కొత్త ఆలోచనల గురించి మార్చు

  1. వీడియోపాఠాల పరిధిలో టెంప్లెట్లు లోకలైజ్ చేయడం, ఇన్ఫోబాక్సులు లోకలైజ్ చేయడం, సృష్టించడం, రిఫరెన్సులు, సైటేషన్లు ఇవ్వడం వంటి అంశాలు లేకుంటే, ఆయా పనులు ఎలా చేయాలి అన్న అంశంపై "how to" తరహా వీడియోలు రూపొందించాలని కోరారు.
  2. మీడియాపై ప్రత్యేక శ్రద్ధ: తెవికీ ప్రాజెక్టులను తెలుగు ప్రింట్, డిజిటల్ మీడియాల్లో ప్రాచుర్యం చేయడంపై ప్రత్యేకమైన ప్రణాళిక, శ్రద్ధ అవసరమన్నారు. ఈ క్రమంలో కేవలం సంప్రదాయిక ప్రసార మాధ్యమాలపైనే కాకుండా ఎఫ్.ఎం. రేడియో వంటివాటిని ఎలా వినియోగించుకోవచ్చో ఆలోచించాలని కోరారు.