నా పేరు డా. పులికొండ సుబ్బాచారి.

నేను ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, జానపద శాఖకు హెడ్ గా, డీన్ అకడమిక్ అఫైర్స్ గా పని చేస్తున్నాను. తెలుగులో ఉన్న వికీ పీడియా గురించి ఇటీవల తెలుసుకున్నాను. దీన్ని చూచి నాకు చాలా సంతోషం అయింది. ఇది దిన దినాభివృద్ధి చెందుతూ ఉంది. అందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఫోక్ లోర్ కు సంబంధించి ఇప్పటికే చాలా పుస్తకాలు,వ్యాసాలు ప్రచురించి ఉన్నాను.

నేను తెలుగులో ఉన్న వికీపీడియాలో కూడా వ్యాసాలు రాసి ప్రచురించాలని అనుకుంటున్నాను. నేను యూనికోడ్ ఫాంట్ లో నా కంప్యూటర్ లో చేసిన వ్యాసాలను వికీలోనికి ఎలా పంపాలి ఏ చిరునామాకి పంపాలి. దయచేసి వివరాలు రాయండి.

నా దగ్గర నా పర్యవేక్షణలో కొందరు విద్యార్థులుకూడా పరిశోధన చేస్తున్నారు. వారు కూడా దీనికి వ్యాసాలు రాయాలని కోరికగా ఉన్నారు. దయచేసి వివరాలు పంపించండి. భవదీయుడు

సుబ్బాచారి.