డామే మార్గరెట్ నటాలీ స్మిత్

(వాడుకరి:Radhika41/ప్రయోగశాల నుండి దారిమార్పు చెందింది)

డామే మార్గరెట్ నటాలీ స్మిత్ (28 డిసెంబర్ 1934-27 సెప్టెంబర్ 2024) ఇంగ్లాండ్ కు చెందిన ఒక బ్రిటిష్ నటి. హాస్య, నాటక పాత్రలలో 'మ్యాగి స్మిథ్' గా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె ఏడు దశాబ్దాలుగా రంగస్థలం ఇంకా సినిమా తెరపై నటించి బ్రిటన్ యొక్క అత్యంత గుర్తించదగిన నటీమణులలో ఒకరు అయ్యారు.[1] ఆమె రెండు అకాడమీ అవార్డులు, ఐదు బాఫ్టా అవార్డులు, నాలుగు ఎమ్మీ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు మరియు ఒక టోనీ అవార్డు పాటు ఆరు లారెన్స్ ఆలివర్ అవార్డులకు నామినేషన్లు అందుకున్నారు. నటనకు ట్రిపుల్ క్రౌన్ సంపాదించిన అతికొద్ది మంది ప్రదర్శనకారులలో స్మిత్ ఒకరు.[2]

మ్యాగి స్మిథ్

2001 నుండి 2011 వరకు, హ్యారీ పాటర్ చిత్రాలలో ప్రొఫెసర్ మినర్వా మెక్గొనాగల్ పాత్రను స్మిత్ పోషించారు. హాగ్రిడ్ పాత్ర పోషించిన స్మిత్ మరియు రాబీ కోల్ట్రాన్లను రచయిత జె. కె. రౌలింగ్ ఈ చిత్రం కోసం అభ్యర్థించారు.[1] ఎనిమిది హ్యారీ పాటర్ చిత్రాలలో ఏడు చిత్రాలలో స్మిత్ నటించారు.

స్మిత్ లండన్లోని చెల్సియా యాండ్ వెస్ట్ మినిస్టర్ ఆసుపత్రిలో 27 సెప్టెంబర్ 2024న 89 సంవత్సరాల వయసులో మరణించారు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Maggie Smith | Biography, Movies, & Facts". Encyclopædia Britannica. 7 September 2023. Retrieved 4 October 2023.
  2. "Triple Crown of Acting Winners". GoldDerby. 5 April 2024. Retrieved 4 June 2024.
  3. "Actress Dame Maggie Smith dies at 89". BBC News. 27 September 2024. Retrieved 27 September 2024.