దైవత్వము

సృష్టికర్త: ఈ సృష్టి స్దితి,లయ,కారకుడే సృష్టికర్త అయి ఉన్నాడు. సమస్త విశ్వమును సృష్టించి అందులో సూర్య,చంద్ర,నక్షత్రములు,గాలి,నీరు,వెలుగు,భూమ్యాకాశములను, సమస్తవాయు మండలములను సృష్టించినవాడే సృష్టికర్త! ఈ విశ్వమందు సమస్త జీవకోటి ప్రాణులను,ఆకాశ పక్షులను,చతుష్పాద జంతువులను,క్రిమికీటకాదులను,సమస్త వృక్షములను, ప్రకృతిని కడురమ్యముగా సృష్టించినవాడే సృష్టికర్త! అతను అతనుగా ఉండినవాడు, ఆయనను ఎవరి చేతను సృష్టించబడనివాడు. రూపము లేనివాడు ఆయనకు ముందు వెనుక, ఆది అంతము లేని వాడు, మహా మహిమాన్మతుడు, అతను ఆత్మయు, శబ్దము,జీవము గలిగి ఉన్నవాడు. అతని శబ్దవాక్కులో జీవము ఉన్నది. జీవముతోకూడిన శబ్దములే ఈఅనంత సృష్టిలో ప్రతీసృష్టములు, అనగా ఉదాహరణకు భూమి అను శబ్దము జీవముతో కూడిన జీవకణము విశ్వగర్బమందు గర్బము దరించగా ఉద్బవించినదే ఈ భూమండలము, మరియు సమస్త సృష్టి అయి ఉన్నది. మానవుడు అను శబ్దకణము జీవముగల నోట పలుకబడి, శాప,తిరస్కార పాప లక్షణములు కలిగి విశ్వము గర్బము దరించగా, రక్తమాంసములు కలిగిన జంతువులను పోలి, రక్తమాంసములుకలిగి ఇతర ప్రాణులవలే జీవించు ప్రాణి అయి ఉన్నాడు ఈ మానవులు.


దైవము అనునది మానవుల వివిద భాష, ప్రాంతములు, కండములు ద్వీపములలో నివాసులు వారిలో మేదావి వర్గమువారు వారి భాషలలో సృష్టికర్తను పిలిచే టైటిల్ దేవుడు, భగవంతుడు, దైవము, భగవాన్ ,అల్లా, ప్రభువు, God,lord, ఇలా అనేక విదములగు మానవులచే సృష్టించబడిన పేర్లయి ఉన్నవి. సృష్టికర్తచే మనము సృష్టించబడినాము. మానవులు సృష్టికర్తను సృష్టించలేదు, పలానా రూపమందు ఉన్నాడనో, ఉంటాడనో, ఉండాలనో, మరియు పలాని పేరు ఉండాలని, అయి ఉంటుందని, ఉండాలని కాని నిర్ణయించు హక్కు మానవులకు ఎంతమాత్రము తగదు. ఉదాహరణకు మనలను కనిన తలితండ్రులు మనకంటే ముందు ఉన్నవారు వారి రూపము, వారికి పేర్లు ముందుగానే నిర్ణయించబడే ఉండును వారిద్వారా సంతానమైన మనము మనతల్లిదండ్రుల రూపమును పేర్లు పలానాగా ఉండాలని మనము పెట్టజాలము. అదే చందమున దైవము (సృష్టికర్త)నకు రూపమును,పేర్లను మానవులు రూపించుట అఙ్ఞానము, అవివేకము అయి ఉన్నది.

దైవత్వము: మహిమ, ప్రేమ, దయ, కృప, సమాదానము, విమోచన లేక విడుదల, రక్షణ, పాపము నుండి విడుదల, క్షమాపణ, పాపము నిమిత్తమై ప్రాయచ్చిత్దము, శాపమునుండి విడుదల, మరణము నుండి జీవమునకు మార్చుట, చీకటినుండి వెలుగునకు నడిపించుట, అఙ్ఞానము నుండి ఙ్ఞానములో నడిపించుట, ఆఙ్ఞలను ఇచ్చుట, బోదించుట, ఉపదేసించుట, గ్రహింపుచేయుట, తల్లి, తండ్రి, గురువు, సహాదరుడు, ప్రవక్తయును, ఇలా సాస్వత జీవముతోను, ఆదియు, అంతము లేనివాడును, మరణము లేనివాడును, మానవులకు మరణము లేకుండా చేయగలుగువాడను, అనేక సద్గుణములు, కలిగిన వాడే సృష్టికర్త (దైవము) అయి ఉన్నాడు. ఈ లక్షణములు కలిగిన ఏకైక సద్గురువు సృష్టికర్త మాత్రమే ఇదే ఆయన తత్వము. ఈ లక్షణములు మానవులకు చెందనివి, మానవులకును, నరులకును, అసాజ్యములు.