నా పేరు రజని. నేను తెలుగు శాఖలో పని చే స్తున్నాను. మా ఊరు రాజారం. నేను తెలుగు సాహిత్యం లో పరిశోధన చేసాను.

మా అమ్మ, మా ఊరు ఎవరికైనా ప్రత్యేకమే. ఈ రెండూ ఎవరికైనా గొప్పవే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మను, అమ్మ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు. అట్లాగే మనం పుట్టిన ఊరు, మన బాల్యమంతా గడిచిన ఊరు, మన జ్ఞాపకాలు అన్నీ మనకు ప్రత్యేకమే.

అమ్మ, రాజారం ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవి. అమ్మను గుర్తు తెచ్చుకోవదమంటె రాజారంతో ఉన్న అనుబంధాన్ని తలుచుకోవడమే. రాజారం గురించి మాట్లాడుకోవడమంటె అమ్మ తలపుల్లో మునిగి తేలడమె.