భారతీయ కోలాటం :

కోలాటం అత్యంత ప్రాచీన నృత్యం. శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో ఆడిన నృత్యం.కోల అంటే కర్ర అనే అర్ధం కాదు. కోల అంటే ఆత్మ. ఒకటి జీవాత్మ. రెండు పరమాత్మ. ఈ రెండింటి సంయోగం 'కోలాటం '.

ఇది కాలక్రమేణా అనేక రూపాంతరాలు చెందింది. గుజరాత్లో దాండియా, ఆంధ్రప్రదేశ్లో కోలాటం, తెలంగాణలో బతుకమ్మ పాటల్లో కోలాటం అంతర్లీ నమయింది.వెనుకటిన ప్రదర్శించిన హరికధలు, బుర్రకధలు, చెక్క భజనలు అన్నీ ఆ భగవంతుని వైపు ప్రజలను మళ్ళించటం కోసం పుట్టిన కళా రూపాలే.

గత రెండు దశాబ్దాలుగా భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్, శివలోకం ప్రాజెక్ట్, కోలాటంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, భక్తి పాటలతో కోలాటంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.