వాడుకరి:Svpnikhil/వికీపీడియా అంటే ఏమిటి? విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది?
జనవరి 15 2001, సరిగ్గా 13 ఏళ్ల 1 నెల క్రితం అంతర్జాలంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం. ప్రపంచ వ్యాప్తంగా 286 భాషల్లో లభ్యమౌతున్న ఒక సంపూర్ణ వివరణాత్మక , విశ్లేషనాత్మక వెబ్ సైట్. జిమ్మీ వేల్స్ , లారీ సాంగర్ అనే ఇద్దరు ఔత్సాహికులచే స్థాపించబడింది. విద్యా, వైద్య, తత్వ, రాజకీయ, చరిత్ర, జీవ, క్రీడా, సంగీతం ఇలా ఎన్నో శాస్త్రాల గురించి విషయాలు తెలుసుకోవచ్చు.
చరిత్ర
మార్చువికీ అంటే హవాయి భాషలో క్విక్ అనగా తొందరగా అని అర్ధం. నుపీడియా అనేది దీని మాతృ సంస్థ. దాని అంతర్ధాన దశలో వికీ ఆవిర్భవించింది.
భేదం
మార్చువికీపీడియా | ఇతర వెబ్ సైట్లు |
---|---|
ఒక విషయానికి సంబంధించిన వ్యాసం ఎవరైనా రాయవచ్చు | వెబ్ సైట్ కి సంబంధించిన వ్యక్తి మాత్రమే రాయాలి |
ఎన్నో అంశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. | ఒక సైటు కేవలం ఒకే అంశానికి ఉపయోగపడుతుంది.
ఉదా: సినిమాకి సంబందించిన దాంట్లో కేవలం ఆ విషయాలే ఉంటాయి. |
ఒక కోత్త విషయం గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా రాయవచ్చు | కేవలం ఆ సైటు పర్యవేక్షిస్తున్న వ్యక్తి మాత్రమే సవరించాలి. |
అనవసర ప్రకటనలు ఉండవు. | వీటి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. |
ఉచితంగా పనిచేస్తూ విరాళాల ద్వారా నడిచే సంస్థ | కొంత రుసుము చెల్లించి వాడుకోవాలి. |
ఉపయోగం
మార్చుఒక వ్యక్తి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లొకి వెళ్లి ఇండియా అని టైపు చెయ్యగానే వివిధ రకాల వెబ్ సైట్లు వస్తాయి. ప్రతిది మరొక దానితో సంబంధం లేకుండా ఉంటుంది. భారతదేశం గురించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే దాన్ని సవరించడానికి ఆ వ్యక్తి మాత్రమే చెయ్యాలి. ఒకవేళ అతనికి కుదరకపోతే ఆ వెబ్ సైట్ చూసిన వ్యక్తి తప్పుడు సమాచారం తెలుసుకుంటాడు. కాని వికిలో ఏదైనా కొత్త విషయం తెలియగానే దాని గురించి తెలిసిన వారెవరైనా క్షణాల్లో మార్పు చెయ్యవచ్చు.
విశిష్టత
మార్చు- ఇందులో ముఖ్యంగా కళలు సంస్కృతి సంప్రదాయాలు గురించి--30% ఉంది.
- వ్యక్తుల జీవిత చరిత్ర గురించి --15%
- భూగోళ, చరిత్ర , పర్యావరణ, సాంకేతిక రంగం మరియు మతం, ఆరోగ్యం గురించి వ్యాసాలు ఉంటాయి.
విద్యార్థులు-ఉపయోగం
మార్చుప్రస్తుతం విద్యార్థులు ఎన్నో పోటీ పరిక్షలకు సిద్హమౌతున్నారు. సివిల్స్ ,బ్యాంకు పరీక్షలు మొ"నగు వాటికి వర్తమానంసాలు , సాధారణ పరిజ్ఞానం సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఆనకట్టలు ఉన్నాయో తెలుసుకోవలనిపిస్తే ---ఆనకట్ట అని టైపు చెయ్యగానే 'అసలు ఆనకట్ట అంటే ఏంటి, ఆ పదం ఎలా పుట్టింది నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆనకట్టల వరకు ప్రతి విషయం వస్తుంది'. ఇంకా శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవచ్చు. ఒక రంగంలోని ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనిపిస్తే దానితో పాటు ఆ రంగంలోని ఇతర వ్యక్తుల గురించి కూడా తెలుస్తుంది.
పురస్కారం
మార్చు- అంతర్జాల సైట్లకి పురస్కారం అందించే అలెక్సా అనే సంస్థ ఎక్కువ మంది వినియోగదార్లు ఉన్న 6వ సంస్థగా వికీని గుర్తించింది.
- బ్రాండ్ ఛానల్ అనే సంస్థ నిర్వహించిన విశ్లేషణలో "2006 లో ఏ సంస్థ ఉత్పత్తి ప్రజల మీద అత్యంత ప్రభావం చూపింది " అనే ప్రశ్నకు సమాధానం గా 4 వ బహుమతితో సత్కరించింది.
- హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక పాఠ్యాంశo గా ప్రవేశ పెట్టింది.
ముగింపు
మార్చువికితో నా అనుభందం
మార్చునేను ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి తహతహలాడుతుంటాను. చరిత్ర, రాజ్యాంగ వ్యవస్థ గురించి, ప్రపంచ దేశాల గురించి ఎన్నో సరికొత్త అంశాల గురించి నేర్చుకున్నాను. ఎన్నో సవరణలు చేశాను, దానికి గుర్తుగా బార్న్ స్టార్ పతకంతో నన్ను సత్కరించింది.
దోషాలు
మార్చుచాల మంది సరదాగా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు రాస్తున్నారు, దీన్ని నియంత్రించాలి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతోమందికి జ్ఞాన సముపార్జన అందించే ఇటువంటి సైట్లని మనం ఆదరించాలి.