నా పేరు నిఖిల్. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. చదువు రీత్యా నేను చాలా ఊర్లలో నివసించాను (గుంటూరు,కారంపూడి, డిల్లీ, పుదుచ్చేరి). ప్రస్తుతం (2020 నుండి) నరసరావుపేటలో ఉంటున్నాను. నాకు ప్రయాణాలు, పర్యాటకం అంటే ఇష్టం. మన తెలుగు భాష అంటే వల్లమానిన అభిమానం. సాధ్యమైనంతవరకు నా మాటల్లో ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడతా.
ఒక వ్యాసం చాలా విభాగాలు కలిగి పెద్దదిగా ఉందనుకోండి. అప్పుడు సందర్శకుడు ఏదైనా ప్రత్యేక విభాగానికి వెంటనే వెళ్ళాలంటే [[#ఇదే వ్యాసం లోని ఒక విభాగం]] అని మీ వ్యాసంలో చేర్చవచ్చు.