నీమాస్త్రం తయారు చేయువిధానం

కావలసిన పదార్ధములు:-

వేప ఆకులు --10 కేజీలు

ఆవు పేడ - 2 కేజీలు

ఆవు ముత్రం - 10 లీటర్లు

నీళ్ళు - 200 లీటర్లు(15 బిందెలు)

డ్రమ్ము - ఒకటి


తయారు చేయువిధానం:-

ముందు వేప ఆకులను ముద్దగా నూరుకోవాలి. డ్రమ్ములో పదిహేను బిందెలు నీళ్ళు పోసుకోవాలి. దానిలో వేప ఆకుల ముద్దను నీళ్ళలో కలుపుకోవాలి. తర్వాత రెండు కేజిల ఆవుపేడ కలుపుకోవాలి. పది లీటర్ల ఆవుముత్రం మొత్తం పోసుసుకోవాలి. ఈ మొత్తాన్ని కట్టెతో బాగా కలపాలి. కలిపిన తరువాత డ్రమ్మును ముతతో ముయాలి. రోజుకు మూడు సార్లు ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం కర్రతో బాగా కలపాలి. ఈ విధంగా రెండు రోజుల తర్వాత ఒక గుడ్డతో వడబోసి పంటకు పిచికారి చేయాలి. ఈ కషాయం మూడు నెలలు వరకు నిల్వ ఉంటుంది. దీనిలో మరలా నీళ్ళు కలుపకూడదు. కషాయంను మత్రమే పిచికారి చేయాలి. పంట మీద వచ్చు అన్ని రకాల గుడ్లు నాశనం అవుతాయి. ఈ కషాయం వల్ల కొంత వరకు వచ్చే తెగులు కూడా నివారిస్తుంది.



యేరువ సందీప్ రెడ్డి