జీవితం

మార్చు

జీవితం[మార్చు] డేవిడ్ అసలు పేరు అజ్జపాగు డేవిడ్ రాజు. ఇంటి పేర్లు కూడా పితృస్వామ్య భావజాలంలో భాగంగానే వచ్చాయి అనే కారణంతో రంగనాయకమ్మ రచనలతో ప్రభావితమై తన ఇంటి పేరును మరియు చివరిగా వున్న రాజు ను తొలగించుకున్నాడు. డేవిడ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో 1980 అక్టోబర్ 16 న పుట్టాడు. చిన్నప్పుడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో (పి.డి.ఎస్.యు) భావాజాలంతో ప్రభావితమై అనంతరం భారత విద్యార్థి సమాఖ్య (ఎస్.ఎఫ్.ఐ) లో క్రియాశిలంగా పనిచేశాదు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటిలో ఏం.ఏ చదువుతున్న రోజులతో యూనివర్శిటి విద్యార్థి సమస్యలపై, నాటి వైస్ చాన్స్ లర్ డి.సి. రెడ్డి ప్రవేశపెట్టిన సెమిస్టర్ సిస్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు.