స్వర్గ శ్రీ యలమంచిలి నారాయణ మూర్తి @ మేస్త్రి గారు వారి చతుర్ధ కుమారుడు శ్రీ యలమంచిలి వెంకట రమణ. వీరి జన్మ ఆంధ్రప్రదేశ్ : తూర్పు గోదావరి జిల్లా , రావులపాలెం మండలం లోని ముమ్మిడివరప్పాడు అనే గ్రామం లో 1969 సంవత్సరం ఫిబ్రవరి మాసం 16 తేది ఉదయం 3:35 నిమిషాలకు వారి స్వగ్రుహమందు జరిగింది. శ్రీ యలమంచిలి వెంకటరమణ గారిని ముద్దుగా అందరు బుజ్జిబాబు గా గుర్తించేవారు. ఇప్పటికి వారిని బుజ్జి బాబు గానే ప్రాంతీయులు గుర్తించినా వారి తాతయ్య గారైన కి శే !! యలమంచిలి వెంకన్న గారి గురుతుగా వీరికి యలమంచిలి వెంకటరమణ అని వారి నానమ్మ యలమంచిలి మరినమ్మ గారిచే నామకరణం చేయబడింది. కి శే . యలమంచిలి వెంకన్నగారి స్వగ్రామము అదే జిల్లా లోని గన్నవరం మండలం ముంగండ గ్రామము .యలమంచిలి వెంకటరమణ గారి తాతగారైన శ్రీ వెంకన్న గారు భూతవైద్యం లోను , ఆయుర్వేదం లోను పేరు గాంచిన వైద్యులు. యలమంచిలి వెంకన్న గారు మరియు యలమంచిలి మరినమ్మ దంపతులకు ౧౧ మంది సంతానం కాగ శ్రీ యలమంచిలి నారాయణ మూర్తి గారు ౯ వ సంతానం. నారాయణ మూర్తి గారి వివాహం అమలాపురం వాసులు సరస్వతి గారితో జరిగింది. ఈ ఇరువురి సంతానమే యలమంచిలి వెంకటరమణ గారు. యలమంచిలి వెంకటరమణ గారికి 4 అన్నయ్యలు ౨ తమ్ములు కాగా అక్క చేల్లెండ్రు వారికి లేరు. శ్రీ యలమంచిలి నారాయణ మూర్తి @ మేస్త్రి గారి ద్వార ముమ్మిడివరప్పాడు గ్రామం లో అవాసమేర్పరచుకుని తిదివరకు అదే స్వగ్రామము గా కొనసాగారు ..మేస్త్రిగారి కి వారి కుటుంబానికి చుట్టుప్రక్కల్ పలు గ్రామాలలో ఎంతో గుర్తింపు ఉండేది అంటే అది రమణ గారి తండ్రి నారాయణమూర్తి గారి మంచితనమే అని చెప్పవచ్చు, శ్రీ యలమంచిలి నారాయణమూర్తి : సరస్వతి దంపతుల సంతానం ౬ గురు ఎంతో వినయ విధేయతలతో పెరిగి అందరికి ఆదర్శ ప్రాయంగా ఉండే వారు. వారిని ఆ గ్రామములో కలియుగ పాండవులు గా గుర్తిచేవారు 1992 జూన్ 11 వ తేదిన గన్నవరం మండలం నడిగది గ్రామా వాసులు కి శే మానుకోండ శ్రీ రాములు & లక్ష్మి ల జేస్తా పుత్రి మానుకోండ మంగాదేవి తో వివాహం జరిగింది వివాహం తరువాత మానుకోండ మంగాదేవి యలమంచిలి సంధ్య గా అటు అత్తింటికి కూడా మంచి పేరు సమకూర్చి కోడలిగా కూతురుగా ఆ ఇంటికి తలమానికమే కాదు ఆ గ్రామానికి ఒక ఆధార్షంయ్యారు .. ఈ ఇరువురి సంతానమే యలంచిలి కరిష్ కుమార్ @ అభి ( 25/09/1994) మరియు నవ్య సౌందర్య (07/02/1996)