BubblySnow
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు
మార్చువికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.
రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)