వాత్సల్య కళాశాల
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల అనంతారం గ్రామ పరిసరాలలో ఉంది.
శ్రీ వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ మల్టిd నేషన్ కంపెనీలు 10 ఇంటర్నేషనల్ సర్వీస్, ఐటి ఫ్లెక్సెస్, టెక్ జీనియస్ సొల్యూషన్ కంపెనీలచే క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించారు. ఈ సెలక్షన్లలో నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వివిధ కళాశాలలకు చెందిన 517 మంది హాజరయ్యారు. బిటెక్, ఎంటెక్, ఎంబిఏ, ఎంసిఏ బ్రాంచీలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి విద్యార్థులను స్క్రీనింగ్ చేసి 323 మంది విదార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. 126 మంది విద్యార్థులు ఫైనల్‌కు అర్హత సాధించగా, 79 మంది విద్యార్థులు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులే కావడం విశేషం. ఎక్కువ విద్యార్థినులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 9 మంది వాత్సల్య విద్యార్థులకు 10 కంపెనీ ప్రతినిధులు ఆఫర్ లెటర్‌ను అందజేశారు. మిగతా 70 మంది విద్యార్థులకు చెన్నై, పూణ, హైదరాబాద్‌లలో చేరాల్సిందిగా కోరారు. ఈ సెలక్షన్లలో వివిధ కంపెనీల ప్రతినిధులు జ్యోతీష్, శ్రీనివాస్, కన్నన్, త్రిష్ల, రీతు, ప్రణబ్, మహేష్, దినకర్, శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భంగా వాత్సల్య కళాశాల ఛైర్మన్ దరిపల్లి అనంతరాములు మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్లలో అధిక శాతం వాత్సల్య విద్యార్థులే ఎంపిక కావడం సంతోషదాయకమన్నారు.
విద్యార్థుల అభ్యున్నతికి కళాశాల యాజమాన్యం, కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉన్నత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో కృషి చేస్తున్నామన్నారు, కరస్పాండెంట్ దరిపల్లి నవీన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్యాంపస్ సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల5,11న మరో విడత సెలక్షన్లు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సె క్రటరీ ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపల్ రంగారావు, కో ఆర్డినేటర్లు ప్రొఫెసర్ రాం ప్రసాద్,జివి రవికుమార్, బాల కృష్ణతో పాటు ఆర్గనైజింగ్ దరిపల్లి అంబిక విద్యార్థులు పాల్గొన్నారు.
మండలపరిధిలోని అనంతారం గ్రామశివారులోని వాత్సల్య ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు సంయుక్తంగా దేశస్థాయిలో నిర్వహించిన సాంకేతిక అవగాహనా సదస్సు శనివారం ముగిసింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు సదస్సు దోహదపడిందని వక్తలు వారివారి ప్రసంగాల్లో తెలిపారు. జెఎన్‌టియులో సిఎస్‌ఇ విభాగంలో అవినాష్‌గౌడ్ 9వ ర్యాంకు సాధించడం, జెఎన్‌టియులో కంప్యూటర్ సర్వీస్ విభాగంవారు నిర్వహించిన క్వెస్ట్ 09 అను సింపోజియంలో ప్రథమ బహుమతి పొందడం ఇందుకు నిదర్శనమని వారు ఆ విద్యార్థులను అభినందించారు. సదస్సు పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులతోపాటు నగదును ప్రదానం చేశారు. వాత్సల్య విద్యాసంస్థల అధినేత ఛైర్మన్ దరిపెల్లి అనంతరాములు, కళాశాల కరస్పాండెంట్ దరిపెల్లి నవీన్‌కుమార్ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న సాంకేతిక సదస్సులకు ప్రతి సంవత్సరం మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి దరిపెల్లి ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్.కల్నల్‌శాస్త్రి, కళాశాల ఛీఫ్ సూపరింటెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ ఇజె.రావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మైత్రేయి, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ సురేష్‌బాబు, కళాశాలల అధ్యాపక బృందం, వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపక బృందం పాల్గొంది. విద్యార్థులు ఈ సాంకేతిక సదస్సులో భాగస్వాములయ్యారు.
దేశ భద్రతను కాపాడేందుకు మిలవూటీలో యువత అధిక సంఖ్యలో చేరాలని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ న్యూఢిల్లీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ బలవంత్‌సింగ్, కల్నల్ రాబర్ట్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ భయాన్ సోరాల్ అన్నారు. మండలంలోని అనంతారం గ్రామ పరిధిలో గల వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన ఇండియన్ ఆర్మీ సెలక్షన్‌కు ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. దేశ భద్రతను కాపాడేందుకు యువత నడుం బిగించాలన్నారు. ఈ ఇంటర్వ్యూలలో రంగాడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు. బీటెక్, ఎంటెక్ నుంచి హాజరైన విద్యార్థులకు ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించారు. టెక్నికల్ కేటగిరిగాఎటువంటి రాత పరీక్షలు లేకుండాఎంపిక చేసినట్లు తెలిపారు. వాత్సల్య కళాశాలకు చెందిన 36 మంది ఎంపిక కావడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. కార్యక్షికమంలో కళాశాల కరస్పాండెంట్ దరిపెల్లి నవీన్‌కుమార్, ట్రెజరర్ ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రంగారావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ గణేష్, కో ఆర్డినేటర్లు రాంప్రసాద్, బాలకృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు.