వానతి శ్రీనివాసన్
వానతి శ్రీనివాసన్ (Vāṉathi Srīṉivāsaṉ) తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకురాలు, న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆమె 1993 నుండి చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంది. వానతీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా పనిచేస్తుంది. ఆమె 2021 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించింది.[1][2]
వానతి శ్రీనివాసన్ | |||
శాసనసభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 మే 2021 | |||
ముందు | అమ్మన్ కె. అర్జునన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం | ||
భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 28 అక్టోబర్ 2020 | |||
అధ్యక్షుడు | జగత్ ప్రకాష్ నడ్డా | ||
ముందు | విజయ రహత్కర్ | ||
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
| |||
పదవీ కాలం 3 జులై 2020 – 28 అక్టోబర్ 2020 | |||
అధ్యక్షుడు | ఎల్.మురుగన్ | ||
బీజేపీ ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 16 ఆగష్టు 2014 – 3 జులై 2020 | |||
అధ్యక్షుడు | తమిళిసై సౌందరరాజన్ ఎల్. మురుగన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 జూన్ 1970 | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సు శ్రీనివాసన్ | ||
సంతానం | 2 | ||
నివాసం | చెన్నై, తమిళనాడు | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు, న్యాయవాది | ||
వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
జననం & విద్యాభాస్యం
మార్చువానతి శ్రీనివాసన్ 1970, జూన్ 6న కందస్వామి, పూవతల్ దంపతులకు తమిళనాడులెని, కోయంబత్తూరు, ఊళియంపాలయం గ్రామంలో జన్మించింది. ఆమెకు శివ కుమార్, తమ్ముడు ఉన్నాడు. ఆమె పదవ తరగతి వరకు తొండాముత్తూర్ హైయర్ సెకండరీ స్కూల్ లో చదివి, పి.ఎస్.జి ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసింది. వానతి శ్రీనివాసన్ చెన్నైలోని డా. అంబేద్కర్ ప్రభుత్వ లా కళాశాల నుండి లా పట్టా అందుకుంది.
వ్యక్తిగత జీవితం
మార్చువానతి శ్రీనివాసన్ కు, సు. శ్రీనివాసన్ తో వివాహం జరిగింది.ఆయన (2014-2017) వరకు మద్రాస్ హైకోర్ట్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా పనిచేశాడు. వానతి శ్రీనివాసన్ దంపతులకు ఇద్దరు కుమారులు ఆదర్శ్ వి.శ్రీనివాసన్ & కైలాష్ వి.శ్రీనివాసన్ ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చువానతి శ్రీనివాసన్ 1988లో పి.ఎస్.జి ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ లో చదువుతూనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చేరింది. అనంతరం ఆమె కాలేజ్ కార్యదర్శిగా, కోయంబత్తూరునగర సంయుక్త కార్యదర్శిగా నియమితురాలైంది. లా కాలేజీలో చదువుతునప్పుడు ఆమె రాష్ట్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు సంయుక్త కార్యదర్శిగా నియమితురాలైంది.
వానతి శ్రీనివాసన్ 1993 నుండి 1999 వరకు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసింది. ఆమె 2011లో తొలిసారిగా మైలాపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యింది. 2016లో కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఓటమి చెందక ఓటమి యాత్రకు పేరిట విన్నూతమైన కార్యక్రమం చేపట్టి నియోజకవర్గంలోని ఒక్కో వీధికి వెళ్లి మరీ తను ఓడినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.[3] ఆమె 2020 నవంబరులో భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.
వానతి శ్రీనివాసన్ 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి 'మక్కల్ నీది మయ్యం పార్టీ' అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ పై విజయం సాధించింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ News18 (3 May 2021). "Tamil Nadu: Kamal Haasan Loses to BJP's Vanathi Srinivasan in Coimbatore South". Archived from the original on 3 May 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (4 May 2021). "తమిళనాడు: అప్పుడు 32 మంది, కానీ ఇప్పుడు 12 మంది". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
- ↑ Andhrajyothy (20 May 2016). "ఎన్నికల్లో ఓడిపోయిన ఏ అభ్యర్థి చేయలేని పని ఈమె చేసింది !". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
- ↑ NDTV (2 May 2021). "Kamal Haasan Loses To BJP Candidate In Tamil Nadu's Coimbatore South". Archived from the original on 2 May 2021. Retrieved 4 May 2021.
- ↑ NTV Telugu (4 May 2021). "1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ..." Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.