వామన్ కుమార్
వామన్ విశ్వనాథ్ కుమార్ (జననం 1935 జూన్ 26) 1961లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతన్ని వివి కుమార్ అని అంటారు. 1961 లో ఢిల్లీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో, తన తొలి టెస్టులో, తొలి ఇన్నింగ్స్‌లో వివి కుమార్, ఐదు వికెట్లు తీశాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వామన్ విశ్వనాథ్ కుమార్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మద్రాసు, బ్రిటిషు భారతదేశం | 1934 అక్టోబరు 24|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 101) | 1961 ఫిబ్రవరి 8 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1961 నవంబరు 11 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 నవంబరు 20 |
ఫస్ట్ క్లాస్ క్రికెట్
మార్చురంజీ ట్రోఫీలో వామన్ అద్భుత విజయం సాధించాడు. అతను అరవైల నుండి డెబ్బైల వరకు అద్భుతమైన బౌలర్‌గా దేశీయ క్రికెట్‌లో రాణించాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టేవాడు. 1970-71 సీజన్‌లో, రంజీ ట్రోఫీలో మూడు వందల కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి బౌలరుగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత తొలిసారి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
టెస్ట్ క్రికెట్
మార్చువామన్ కుమార్ తన కెరీర్ మొత్తంలో కేవలం రెండు టెస్టుల్లోనే ఆడాడు. ఆ రెండు టెస్టులూ 1961 లో ఆడాడు.
1960-61 సీజన్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. అతను 1961 ఫిబ్రవరి 8 న పాకిస్తాన్‌పై తన తొలి టెస్టు ఆడాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన సిరీస్‌లోని ఐదవ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.[2] ఆ ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్ గణాంకాలు 37.5-64-5. రెండో ఇన్నింగ్స్‌లో 2/68. అయితే గేమ్ డ్రాగా ముగిసింది. 1932లో మొహమ్మద్ నిసార్ తర్వాత అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలరుగా నిలిచాడు. ఆ ఇన్నింగ్సులో అతను ఏకే ఇంతియాజ్ అహ్మద్, డబ్ల్యూ మథియాస్, ఫజల్ మహమూద్, మహమూద్ హుస్సేన్, హసీబ్ అహ్సాన్‌లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కు పంపాడు.
వామన్ కుమార్ తదుపరి సీజన్‌లో తన రెండవ, చివరి టెస్టులో ఆడాడు. అందులో అతను గాయపడ్డాడు. అయితే, లెగ్ స్పిన్‌ను ఆడడంలో ప్రత్యర్థికి ఉన్న బలహీనత కారణంగా అతన్ని ఆడించారు. అయితే అందులో అతనికి వికెట్ దక్కలేదు. ఆ తరువాత భగవత్ చంద్రశేఖర్ లాంటి స్పిన్నర్లు రావడంతో ఇక టెస్టులకు అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు.
ఆట శైలి
మార్చువామన్ కుమార్ ఒక సాంప్రదాయిక లెగ్ స్పిన్నరు. ఆ సమయంలో అతను దేశంలోని ప్రముఖ బౌలరు. అతను సరైన స్థలంలో బంతిని వేసి బ్యాటరును ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని ఒకప్పుటి ప్రసిద్ధ భారత బౌలరైన సుభాష్ గుప్తేకి తగిన వారసుడిగా పరిగణించేవారు.
ప్రస్తుతం అతను చెన్నైలో MAC స్పిన్ అకాడమీని నడుపుతున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "5th Test: India v Pakistan at Delhi, Feb 8-13, 1961". espncricinfo. Retrieved 2011-12-18.
- ↑ "IND vs PAK, Pakistan tour of India 1960/61, 5th Test at Delhi, February 08 - 13, 1961 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.