వారం

(వారము నుండి దారిమార్పు చెందింది)

వారం అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానం. ఒక సంవత్సరంలో 52 వారాలు, ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి.

వారంలోని రోజులు

మార్చు

వారంలో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:

వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు

మార్చు

పంచాంగంలోనూ, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.

  • ఆదివారం - రవి (సూర్యుడు)

శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||

ఆదివారము పట్టాభిషేకం, మాంగళ్య ధారణం, సేవకాకృత్యం, అస్త్రం పట్టుట, ఔషదసేవ, యుద్ధంనకు ధాత్వాది కృత్యాలకు మంచిది.
  • సోమవారం - చంద్రుడు

శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||

సోమవారం శంఖాది ముక్తాభరణాలకు, వెండి, స్త్రీ గ్రహణంనకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభాలకు యజ్ఞంలకు, కృషి ప్రారంభాలకు మంచిది.
  • మంగళవారం - కుజుడు

శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||

మంగళవారం విష ప్రయోగానికు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యాలకు, పగడాలు మున్నగునవి ధరించుటకు మంచిది.
  • బుధవారం - బుధుడు

శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||

బుధవారం నృత్యం, శిల్పం, వాస్తు కర్మం, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసంనకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనం దాచుటకు, ధాన్యం దాచుటకు వివాహాలు చేయుటకు మెదలగు కృత్యాలు చేయుటకు మంచిది.
  • గురువారం - గురువు

శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||

యజ్ఞం, పురాణం, మాంగళ్యం, బంగారం, వస్త్రాభరణాది భూషణం, వృక్షలతా స్ధాపనకు మంచిది.
  • శుక్రవారం - శుక్రుడు

శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||

శుక్రవారం నృత్యం నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారం గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకానికు, ఉత్సవాలకు, వృషభములు కొనుట మంచిది.
శనివారం - శని

శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||

శనివారం శస్త్రప్రసంగం, మంత్రసుబంధ విషప్రయోగం, బొంకుట, శిర సంబంధ సకలకార్యాలకు శనివారం మంచిది.
"https://te.wikipedia.org/w/index.php?title=వారం&oldid=2999324" నుండి వెలికితీశారు