వావిళ్ల నిఘంటువు

వావిళ్ల నిఘంటువు 1949 [1]లో ముద్రించబడిన తెలుగు - తెలుగు నిఘంటువు. దీని మొదటి సంపుటము నిర్మాణకర్తలు శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, బులుసు వేంకటేశ్వరులు. దీని రెండవ, మూడవ సంపుటాలకు విద్వాన్ వేదము లక్ష్మీనారాయణశాస్త్రి అదనంగా నిఘంటు నిర్మాణంలో చేరారు.

వావిళ్ల నిఘంటువు
కృతికర్త: శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, బులుసు వేంకటేశ్వరులు, విద్వాన్ వేదము లక్ష్మీనారాయణశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు, మద్రాసు
విడుదల: 1949, 1951, 1953
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 2000 పైన

దీన్ని నాలుగు భాగాలుగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు, మద్రాసు వారు 1949, 1951, 1953 సంవత్సరాలలో ప్రచురించారు.

భాగాలు

మార్చు
  • వావిళ్ల నిఘంటువు మొదటి సంపుటములో అ నుండి ఔ వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[2]
  • వావిళ్ల నిఘంటువు రెండవ సంపుటములో క నుండి ఝ వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[3] మొదటి సంపుటముపై ప్రముఖుల అభిప్రాయాలను చేర్చారు.
  • వావిళ్ల నిఘంటువు మూడవ సంపుటములో ట నుండి న వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[4]

ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
  • వేలూరి శివరామశాస్త్రి : వావిళ్ల నిఘంటువు మొదటి భాగము లోగడనున్న నిఘంటువులను జీర్ణము చేసికొనుటతోపాటు కొత్త వెలుగులు విరజిమ్ముచున్నది. ఇందు దేశ్యములని భ్రమపడుట కవకాశముగల కొన్ని దొంగపదములు వైకృతములని తెలుపు వ్యుత్పత్తి ఉంది. అరవము, కన్నడము మొదలగు భాషలలోని పదముల సోదరత్వము ఇందు నిరూపితము. ఇది తెలుగున కత్యావశ్యకము. ఇందు శిష్టవ్యవహారికములో గల దేశ్యములకు అర్థములు ఉన్నాయి.

మూలాలు

మార్చు