వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్

ప్రచురణ సంస్థ
(వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు నుండి దారిమార్పు చెందింది)

వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ తెలుగు వారి తొలి తరం పుస్తక ప్రచురణ సంస్థ, పంపిణీదారులు. దీనికి పదిహేను దశాబ్దాల చరిత్ర ఉన్నది., అనగా ఎనిమిది తరాలుగా తెలుగువారికి, తమిళ, ఆంగ్ల పాఠకులను వీరు ముద్రించిన పుస్తకాలు అలరించాయి. రాజుల ఆస్థానాలలో, మారుమూల ప్రాంతాలలో తాళపత్రాల మీద శిధిలావస్థలో ఉన్న వందల కొద్దీ గ్రంథాలను ముద్రించి తెలుగువారికి అందించారు.

దీనిని 1854 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రి చెన్నపురి (చెన్నై) తండయార్ పేట లో "ఆది సరస్వతీ నిలయం" పేరిట ముద్రణాలయాన్ని ప్రారంభించాడు. ఇతను 1854-1862 మధ్యకాలంలో సుమారు 50 పుస్తకాలను ముద్రించాడు. వీనిలో శ్రీమద్రామాయణము, గురు బాల ప్రబోధిక, లీలావతీ గణితం, శంకర విజయము, శబ్దమంజరి, విష్ణుసహస్రనామ భాష్యము మొదలైనవి ముఖ్యమైనవి. వీరు 1891లో మృతి చెందారు. అప్పటికి వావిళ్ల రామస్వామి శాస్త్రి గారి కుమారుడైన వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి చిన్నవాడైనందువలన కొంతకాలం ముద్రణ పనులు నిలిచిపోయాయి. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి సంస్కృతాంధ్ర భాషలను అధ్యయనంచేసి 1906 లో ఈ సంస్థకు వారసునిగా బాధ్యతలు స్వీకరించాడు.

ప్రచురణలు

మార్చు

పాత ప్రచురణలు

మార్చు

ప్రస్తుత ప్రచురణలు

మార్చు
 • శ్రీరుద్రాధ్యాయము
 • శ్రీసత్యనారాయణ వ్రతకల్పము
 • యజుర్వేద ఆబ్దిక మంత్రములు
 • పాణిగ్రహణము
 • యజుర్వేద సంధ్యావందనము
 • ఆంధ్ర ద్రావిడ సంధ్యావందనము
 • అమావాస్య తర్పణము
 • కాలామృతం
 • సర్వార్థ చింతామణి
 • వేదాంతపంచదశి
 • వ్రత రత్నాకరము (రెండు భాగాలు)
 • ఆముక్తమాల్యద
 • మనుచరిత్రము (1947)
 • జయదేవుని గీతగోవిందకావ్యము
 • శ్రీకృష్ణలీలాతరంగిణి
 • యోగామృతము

మూలాలు

మార్చు
 1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
 2. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
 3. Andhra Srimadramayanamu, Volume-1 (1924) at Digital Library of India.
 4. Andhra Srimadramayanamu, Volume-2 (1924) at Digital Library of India.
 5. Andhra Srimadramayanamu, Volume-3 (1924) at Digital Library of India.
 6. Andhra Srimadramayanamu, Volume-6 (1917) at Digital Library of India.
 7. Andhra Srimadramayanamu, Uttara Kandamu (1924) at Digital Library of India.
 8. https://archive.org/details/MedinikoshamuTel
 9. భారత డిజిటల్ లైబ్రరీలో నా మహారాష్ట్ర యాత్ర, ప్రథమ భాగము పుస్తకం.
 10. భారత డిజిటల్ లైబ్రరీలో శతపత్రసుందరి పుస్తకం.
 11. భారత డిజిటల్ లైబ్రరీలో వేమన పద్యములు పుస్తకం.
 12. భారత డిజిటల్ లైబ్రరీలో కవి జీవితములు పుస్తక ప్రతి.