వాసిష్క
వసిష్క (బాక్ట్రియా: Βαζηþκο, మధ్య బ్రాహ్మి వా-సి-ష్కా, పాలించిన సి. కామను.ఎరా 247-265 కుషాను చక్రవర్తి. ఆయన రెండవ కనిష్క పాలన తరువాత కొంతకాలం మాత్రమే పాలన కొనసాగించాడు.
Vāsishka | |
---|---|
Kushan emperor | |
పరిపాలన | 247–265 CE |
పూర్వాధికారి | Kanishka II |
ఉత్తరాధికారి | Kanishka III |
చట్టం
మార్చుపంజాబు ప్రాంతంలో వాసిష్క పాలన శాసనాలు [2] అలాగే మధురలోని ఇసాపూరు శాసనం ద్వారా ధృవీకరించబడింది.[3] ఆయన పాలన దక్షిణాన సాంచి వరకు నమోదు చేయబడింది. ఇక్కడ ఆయన పేరులో మరొక శాసనం కనుగొనబడింది. 22 వ సంవత్సరం ("వస్కుషనా" సాంచి శాసనం-అంటే వసిష్క కుషనా), 28 వ సంవత్సరం (వాస్కా శాంచి శాసనం -ఇ వశిష్క) కుషాను శకం (కనిష్క శకం రెండవ శతాబ్దం అని విస్తృతంగా భావించబడింది). ఇది ఆయన పాలనను సి. 247-265 కొనసాగిందని తెలియజేస్తుంది.
శిలాశాసనాలు, శిల్పకళ
మార్చువాసిష్కా గురించి విచరించిన 4 శిలాశాసనాలలో కరోధ్టి శిలాశాసనం ఒకటి.[2]
సాంచి బోధిసత్వుడు
మార్చుమధుర కళ నుండి సాంచి ప్రదేశంలో వాసిష్క పేరుతో అనేక విగ్రహాలు లేదా విగ్రహ శకలాలు కనుగొనబడ్డాయి.[4] వాటిలో ఒకటి "వాసిష్క 28 వ సంవత్సరం" నాటి కూర్చున్న బోధిసత్వుడి విగ్రహం. శాసనం ఇలా ఉంది:[5]కుషాను రాజు వాసిష్క 28 వ సంవత్సరం శాసనం సాంచి బోధిసత్వుడు.
లైను 1 ...... స్యా[ర] జె [జ] ఆర్ [ర] జస్య జస్యదేవపుత్రస్య ష్[అ]హి వి[వ]ఎస్[సి]ష్కస్య స[మ] 20 8 ఆయన 1 ది 5 పూర్వ [అయం] భగవ
లైను 2 " స్య జంబుచాయ-శైలగ్రి [హ] స్య ధర్మదేవ విహారె ప్రతిష్టపీఠ వైరాస్య ధితరె మధురిక
లైను 3 " [అనె] న దేయధర్మ-పరి [త్యాగేన]
" విజయం:మహారాజ రాజాధిరాజ దేవపుత్ర షాహి వాసిష్క 28 వ సంవత్సరంలో శీతాకాల మొదటి మాసంలో 5 వ రోజున వీరా పుత్రిక మధురిక చేత కొండ మీద ఉన్న జంబు (నేరేడు చెట్టు) కింద కూర్చున్న " భగవతు (బోధిసత్వుడు)"
ఈ బహుమతి సమర్పించబడింది.[5]
సాంచి పీఠం
మార్చునిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహం పీఠం మరొక భాగం. ఈ శాసనం "వాస్కుషనా 22 వ సంవత్సరం" తో చెక్కబడింది. బహుశా "వాసిష్క కుషానా" గా భావించబడుతుంది.[6][7] కుషాను శైలికి విలక్షణమైన బెల్టులతో పొడవాటి ట్యూనిక్సులో ఆరాధికులతో పరివేష్టితుడై కూర్చున్న బోధిసత్వుడు నిలబడి ఉంటాడు. [5] శాసనం ఇలా ఉంది:
- లైను 1 ..... రాజ్నొ వాష్కుషనస్యా స 20 2 వా 2 ది 10 భగవతు సక్యం [అన్] ఏ ప్రతిష్టపీఠ విద్యామాటియే పు
- లైను 2 ...... మాతా-పిత్రిన సర్వా-సత్వన కా హిత-సు
రాజా వాసిష్కా 22 వ సంవత్సరంలో వర్షాకాలం 2 వ మాసం 10 వ రోజున ఆయ తల్లితండ్రులు, మిగిలిన సమస్త ప్రజల సౌఖ్యం - సంతోషాల కొరకు ఈ శిల్పం " భగవతు శాక్యముని " వైద్యమతి చేత స్థాపించబడింది.[8]
ఆరా శిలాశాసనం
మార్చుమూడవ కనిష్కా "అరా శాసనం" లో వాసిష్క కనిపిస్తుంది. ఇది సింధు ప్రాంతంలో అటాకుకు సమీపంలో దక్షిణాన ఉంది. ఈ శాసనం లో మూడవ కనిష్క ఖరోష్తిలో "వాజేష్క" కనిష్క తండ్రిగా భావించినట్లు కనిపిస్తుంది.[9]
వాసిష్కా 24 వ సంవత్సరం ఇసాపురు శిలాశాసనం
మార్చుఇది మధ్య బ్రాహ్మి లిపిలో స్వచ్ఛమైన సంస్కృతంలో వాసిష్క పేరిట ఉన్న ఒక శాసనం. ఆయన పూర్తి సామ్రాజ్య శీర్షికలతో మహారాజాస్య రాజిధిరాజస్య దేవపుత్రస్య షహే వాసిష్కస్య ("గొప్ప రాజు, రాజుల రాజు, ఆయన ఘనత, షాహి వాసీష్క") కనుగొనబడింది. మధుర నగరానికి సమీపంలో ఇప్పుడు మధుర మ్యూజియంలో ఉన్న "యుపా", ఒక యాగ బ్రాహ్మణ స్తంభం షాఫ్టు మీద లిఖించబడింది. [11][12]
నాణేలు
మార్చువాసిష్కా నాణేలు ఆయన పూర్వీకుల కంటే చిన్నవిగా మారాయి. చిన్న చిన్న సైజులలో ముద్రించబడ్డాయి. లోహ నాణ్యత క్షీణించింది. [2] ఆయన నాణేల వెనుకవైపు కనిపించే దేవతలు నాణేలలో ఉన్నట్లు హువిష్కా, మొదటి వాసుదేవ చిత్రాలతో జారీ చేయబడ్డాయి.[2]
కుషానో-సాసానియా పాలకుడు మొదటి అర్దాశీరు కుషన్షాతో కలిసి వసిష్కా అనేక నాణేలు కనుగొనబడ్డాయి. ఇది ఇద్దరు పాలకుల మధ్య శత్రుత్వం, పరస్పర చర్యను సూచిస్తుంది.[13]
వాసిష్కా నాణేలు సాధారణంగా గ్రీకో-బాక్టీరియా లిపిలో పురాణం లిఖించబడి ఉంటుంది పయోనానోప్యో బజిప్కో కొపానొ ("కింగ్ ఆఫ్ కింగ్ బజేష్కో కుషానో")[14]
కొంచెం భిన్నమైన పేరు గల కొన్ని నాణేలు (అబ్వర్సు పురాణం పయానానొపయొ బజొయాహొ/బజిహొ కొపానొ "కింగ్ ఆఫ్ కింగ్ బజోడియో ది కుషన్") "వాస్కుషనా" కు ఆపాదించబడ్డాయి. సాధారణంగా వాసిష్కాతో సమానం.[15][16]
వనరులు
మార్చు- "Ancient Indian Inscriptions", S. R. Goyal, 2005
- "From Persepolis to the Punjab: Exploring Ancient Iran, Afghanistan and Pakistan", Elizabeth Errington and Vesta Sarkhosh Curtis, 2007.
- The Crossroads of Asia: Transformation in Image and Symbol", Elizabeth Errington and Joe Cribb, 1992.
మూలాలు
మార్చు- ↑ CNG Coins notice
- ↑ 2.0 2.1 2.2 2.3 Rezakhani, Khodadad (2017). "From the Kushans to the Western Turks". King of the Seven Climes (in ఇంగ్లీష్): 203.
- ↑ Rosenfield, John M. (1967). The Dynastic Arts of the Kushans (in ఇంగ్లీష్). University of California Press. p. 57.
- ↑ Mitra, Debala (2001). Sanchi. Archeological Survey of India. p. 7 Note 1. ISBN 9788187780182.
- ↑ 5.0 5.1 5.2 Kuraishi, Mohammad Hamid; Kak, Ram Chandra; Chanda, Ramaprasad; Marshall, John Hubert (1922). Catalogue of the Museum of Archaeology at Sanchi, Bhopal State. Calcutta, Superintendent Government Printing, India. pp. 29–32.
- ↑ Dani, A. H.; Staff, UNESCO; Asimov, M. S.; Litvinsky, B. A.; Zhang, Guang-da; Samghabadi, R. Shabani; Bosworth, C. E. (1994). History of Civilizations of Central Asia: The Development of Sedentary and Nomadic Civilizations, 700 B. C. to A (in ఇంగ్లీష్). UNESCO. p. 253. ISBN 9789231028465.
- ↑ "He might have begun to rule even two years earlier if he can be identified with king Vaskushana(=Vasishka Kushana?) of a Sanchi record of the year22" Shashi, Shyam Singh (1999). Encyclopaedia Indica: The Kushana Empire: government, society, and culture (in ఇంగ్లీష్). Anmol Publications. p. 23. ISBN 9788170418597.
- ↑ Marshall, Sir John (1902). Monuments Of Sanchi Vol.1. p. 386.
- ↑ Rosenfield, John M. (1967). The Dynastic Arts of the Kushans (in ఇంగ్లీష్). University of California Press. p. 57.
- ↑ Konow, Sten (1929). Kharoshthi Inscriptions With The Exception Of Those Of Asoka. p. 163.
- ↑ Catalogue Of The Archaeological Museum At Mathura. 1910. p. 189.
- ↑ Rosenfield, John M. (1967). The Dynastic Arts of the Kushans (in ఇంగ్లీష్). University of California Press. p. 57.
- ↑ Rezakhani, Khodadad (2017). ReOrienting the Sasanians: East Iran in Late Antiquity (in ఇంగ్లీష్). Edinburgh University Press. p. 134. ISBN 978-1-4744-0031-2.
- ↑ Singh, Arvind Kumar (1996). Coins of the Great Kushanas (in ఇంగ్లీష్). Parimal Publications. p. 23.
- ↑ Friedberg, Arthur L.; Friedberg, Ira S.; Friedberg, Robert (2017). Gold Coins of the World – 9th edition: From Ancient Times to the Present. An Illustrated Standard Catlaog with Valuations (in ఇంగ్లీష్). Coin & Currency Institute. p. 474, coin 38-39. ISBN 978-0-87184-009-7.
- ↑ "The coins bearing the legend 'ShaonanoShao Ba-Zodeo/Bozoeo Koshano', ('PAONANOPAO BA-ZOAHO / BOZOHO KOPANO') starts at 1 o'clock have 46 been attributed to Vaskushana (Vasishka) by Gobl." in Bhavan, Bharat Kala; Sharma, Savita (1999). Gold Coins of Imperial Kushāṇas and Their Successors in Bharat Kala Bhavan (in ఇంగ్లీష్). Bharat Kala Bhavan, Banaras Hindu University. p. 51.
వెలుపలి లింకులు
మార్చుఅంతకు ముందువారు రెండవ కనిష్క |
కుషాను పాలకులు | తరువాత వారు మూడవ కనిష్క |