అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, వాసుకి (అయోమయ నివృత్తి) చూడండి.

వాసుకి ఆనంద్
జననం
క్రియాశీల సంవత్సరాలు1992 - 1998
2023 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆనంద్ సాయి
పిల్లలుహర్ష (కూతురు),
సందీప్ విశ్వబ్రాహ్మణ (కొడుకు)

వాసుకి భారతీయ సినిమా నటి. ఆమె ప్రధానంగా 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన ప్రేమకథా చిత్రం తొలిప్రేమలో కథానాయకుడు పవన్ కల్యాణ్కు చెల్లెలుగా నటించి ప్రసిద్ధిచెందింది. ఆ యేడాది తొలిప్రేమ ఉత్తమ చలనచిత్రంగా నంది పురస్కారం కైవసం చేసుకోగా ఆమె ఉత్తమ సహాయ నటిగా ఎన్నికైంది.

కెరీర్

మార్చు

ఆమె పదమూడేళ్ల వయసులో అనుకోకుండానే టీవీ ధారావాహికలలో నటించడం మొదలుపెట్టింది. 5 ఏళ్ల తక్కువకాలంలోనే 20కి పైగా టీవీ సీరియల్స్‌ పూర్తిచేసింది. తమిళంలో ఆలుమగలు అనే సీరియల్‌ లో ఆమె నటను చూసిన సినిమా డైరెక్టర్‌ ఎ. కరుణాకరన్ తెలుగు చలనచిత్రం తొలిప్రేమ (1998) సినిమాకు ఎంపికచేసాడు. అందులో పవన్ కల్యాణ్ చెల్లిలి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత ఆమెకు బోలెడన్ని సినిమా అవకాశాలు వచ్చినా పెళ్ళి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంది.


రీ ఎంట్రీ

మార్చు

దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అన్నీ మంచి శకునములే (2023), సుందరకాండ (2024) సినిమాతో ఆమె నటిగా కెరీర్ తిరిగి ప్రారంభించింది.[1]

వ్యక్తిగతం

మార్చు

తొలిప్రేమ చిత్రానికి ఆర్ట్ డైరెక్టరుగా వ్యవహరించిన ఆనంద్ సాయిని వాసుకి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం.[2]

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. "Actress Vasuki Anand Talk About Anni Manchi Sakunamule Movie - Sakshi". web.archive.org. 2023-05-10. Archived from the original on 2023-05-10. Retrieved 2023-05-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "పవన్‌..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం! - alitho saradaga". www.eenadu.net. Retrieved 2021-03-04.