నైంటీస్

తెలుగు భాషా నాటక టెలివిజన్ ధారావాహిక

నైంటీస్‌ 2024లో విడుదలైన వెబ్‌ సిరీస్‌. నవీన్ మేడారం సమర్పణలో ఎంఎన్‌ఓసీ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. శివాజీ, వాసుకీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను నవంబరు 1న[1], ట్రైలర్‌ను 2022 డిసెంబరు 30న విడుదల చేసి, వెబ్ సిరీస్‌ను ఈటీవీ విన్‌ ఓటీటీలో జనవరి 05న విడుదలైంది.[2]

నైంటీస్
దర్శకత్వంఆదిత్య హాసన్
స్క్రీన్ ప్లేఆదిత్య హాసన్
కథఆదిత్య హాసన్
నిర్మాతరాజశేఖర్ మేడారం
తారాగణం
ఛాయాగ్రహణంఅజీమ్ మొహమ్మద్
కూర్పుశ్రీధర్ సోంపల్లి
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
ఎంఎన్‌ఓసీ
విడుదల తేదీ
05 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేసే మధ్య తరగతి వ్యక్తి తన పిల్లలను క్రమ శిక్షణతో పెంచుతుంటారు. చంద్రశేఖర్, ఆయన భార్య రాణి (వాసుకీ ఆనంద్) ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నడిపిస్తుంటారు. పెద్ద కుమారుడు రఘుతేజ (మౌళి తనూజ్ ప్రశాంత్) పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తాడని నమ్మకంతో ఉంటాడు. అమ్మాయి దివ్య (వసంతిక) భవిషత్తుపై, అల్లరి చేస్తూ చదువు బుర్రకెక్కని చిన్నోడు అర్జున్ (రోహన్) చదువు గురించి ఆలోచిస్తుంటారు.సుజిత (స్నేహల్)ను రఘుతేజ ప్రేమిస్తాడు. క్రికెట్ అంటే కూడా ఇష్టపడుతుంటాడు. మరి చంద్రశేఖర్ ఆశించినట్టు రఘుతేజకు పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? వీరి కుటుంబంలో జరిగిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించే ఘనత ఏంటి? అనేదే మిగతా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: ఎంఎన్‌ఓసీ
 • నిర్మాత: నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిత్య హాసన్[6]
 • సంగీతం: సురేష్ బొబ్బిలి
 • సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్
 • ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. Hindustantimes Telugu (1 November 2023). "మధ్య తరగతి కష్టాల్లో శివాజీ.. నవ్వించేలా 'నైంటీస్' వెబ్ సిరీస్ టీజర్". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
 2. Namaste Telangana (31 December 2023). "మధ్యతరగతి అనుబంధాలకు దర్పణం". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
 3. Eenadu (5 January 2024). "శివాజీ నటించిన '#90s' వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
 4. Zee News Telugu (5 October 2023). "వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌ శివాజీ.. ఇంట్రెస్టింగ్ గా ఫ‌స్ట్ లుక్." (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
 5. TV9 Telugu (14 October 2023). "బిగ్‌ బాస్‌ శివాజీ, 'తొలి ప్రేమ' వాసుకీల నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. A. B. P. Desam (27 January 2024). "నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=నైంటీస్&oldid=4185288" నుండి వెలికితీశారు