వింగ్స్ ఆఫ్ ఫైర్

అబ్దుల్ కలాం ఆత్మకథ

వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది 1999లో భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి జీవితచరిత్ర. దీనిని కలాం,[1] అరున్ తివారీలు[2] వ్రాసారు. ఈ పుస్తకంలో ఆయన ప్రారంభ జీవితం, ఇండియన్ స్పేస్ సెంటర్, మిస్సైల్ కార్యక్రమాలలోకి వెళ్ళడానికి కావలసిన కృషి, కష్టాలు, ధైర్యము, అదృష్టం గూర్చి వివరించారు. ఈ పుస్తకంలో తన కెరీర్, చెన్నైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత కాలం, ఇండియాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో ప్రోటోటైప్ హోవర్ క్రాప్ట్ తయారీకి తనను కేటాయించుట గూర్చి వివరించారు. తరువాత ఆయన ఇస్రోకు వెళ్ళి విక్రమసారభాయి స్పేస్ సెంటరులో సహకారం గూర్చి, మొదటి స్పేస్ లాంచ్ వెహికిల్ ప్రోగ్రాం ప్రారంభించుట గూర్చి వ్రాసారు. 1990లలో, 2000 ప్రారంభంలో కలాం డి.ఆర్.డి.ఓకు వెళ్ళుట గుర్చి అచట ఇండియన్ నూక్లియర్ వెపన్స్ కార్యక్రమాల నిర్వహణ గూర్చి, ధర్మోనూక్లియర్ ఆయుధాల ప్రకతి గూర్చి, అగ్ని క్షిపణి గూర్చి వివరించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్‌ పుస్తకం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపింది.

వింగ్స్ ఆఫ్ ఫైర్
అబ్దుల్ కలామ్ ఫైర్ యొక్క వింగ్స్ పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (అరుణ్ తివారీ తో)
ముఖచిత్ర కళాకారుడు: Photograph courtesy: The Week
దేశం: భారతదేశం
భాష: ఆంగ్లం
ప్రక్రియ: India journey to self-reliance in technology
విభాగం (కళా ప్రక్రియ): ఆత్మకథ
ప్రచురణ: Universities Press
విడుదల: 1999
ప్రచురణ మాధ్యమం: ముద్రణ (Paperback)
పేజీలు: 180
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ISBN 81-7371-146-1 (paperback edition)

అనువాదాలు

మార్చు

తొలుత ఇంగ్లీషులో ప్రచురితమైన 'ఒక విజేత ఆత్మకథ' ఆ తర్వాత అనేక భాషల్లోకి అనువదించబడింది. 13 భాషల్లోకి 'ఒక విజేత ఆత్మకథ'ని అనువదించారు. బ్రెయిలీ లిపిలో కూడా 'ఒక విజేత ఆత్మకథ'ని రూపొందించడం విశేషం. అంతే కాదు, చైనా భాషలోకీ 'ఒక విజేత ఆత్మకథ'ని అనువదించడం మరో విశేషం.[3]

పుస్తక నిర్మాణం

మార్చు

ఈ పుస్తకంలో ఏడు విభాగాలలో ఆయన బాల్యం నుండి వివరించడం జరిగింది.

  • ముందుమాట
  • కృతజ్ఞతలు
  • పరిచయం
  • దిశ
  • సృష్టి
  • ప్రొపిషియేషన్
  • తలంపు
  • ఉపసంహారము

తెలుగు అనువాదం

మార్చు

‘ది వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ పుస్తకాన్ని తెలుగులో చినవీరభద్రుడు అనువదించాడు. అనువాద పుస్తకం పేరు "ఒక విజేత ఆత్మకథ"[4]

మూలాలు

మార్చు
  1. "kalam profile". Archived from the original on 2015-08-09. Retrieved 2015-07-28.
  2. "Excerpt". Archived from the original on 2015-08-09. Retrieved 2015-07-28.
  3. "వన్‌ అండ్‌ ఓన్లీ అబ్దుల్‌ కలాం". Archived from the original on 2015-07-29. Retrieved 2015-07-28.
  4. "emescobooks.com/%E0%B0%92%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%87%E0%B0%A4-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5/". Archived from the original on 2014-01-11. Retrieved 2015-07-28.

ఇతర లింకులు

మార్చు