వికలాంగులు

physical handcap wikkipedia

మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి. కాని కొన్ని సందర్భములలో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపం ఉన్న వారిని వికలాంగులు లేక అంగవికలురు అంటారు. వివిధ అవయవముల లోపం ఉన్న వారిని వివిధ రకాలుగా విభజీంచారు. వీరిని ఇంగ్లీషులో హ్యాండికాప్డ్ (Disability-చేతకాని స్థితి, బలహీనము) అంటారు. వీరికి చేయూత నందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది.

వికలాంగుల సౌలభ్య సాధ్యత యొక్క అంతర్జాతీయ చిహ్నం
A man with an above the knee amputation exercises while wearing a prosthetic leg

చరిత్ర మార్చు

28.12.2016 న అమల్లోకి వచ్చి 19.04.2017 నుండి అమల్లోకి వచ్చిన ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ వికలాంగుల హక్కు (ఆర్‌పిడబ్ల్యుడి) చట్టం ప్రకారం ఆధారంగా వైకల్యం నిర్వచించబడింది. ఈ చట్టం క్రింది పేర్కొన్న వైకల్యాలను వర్తిస్తుంది: శారీరక వైకల్యం, లోకో మోటో ,కుష్టు వ్యాధి, పక్షవాతము,మరుగుజ్జు,కండరాల బలహీనత,యాసిడ్ అటాక్ బాధితులు,కను చూపులేక పోవడం ,అంధత్వం,చెవిటి వినికిడి లేక పోవడం , భాష వైకల్యం, మానసిక వైకల్యం,మానసిక ప్రవర్తన,(మానసిక అనారోగ్యం మొదలైన వాటిని " వికలాంగులుగా నిర్వహించినారు.[1]

శారీరక వైకల్యం లో రెండు రకములుగా చెప్ప వచ్చును అవి అస్థిపంజర వైకల్యం, కండరాల లేదా అస్థి వైకల్యాలు, వ్యాధులు , క్షీణత కారణంగా శరీర భాగాల కదలికలతో సంబంధం ఉన్న విలక్షణమైన కార్యకలాపాలను నిర్వహించలేకపోవడం గా పేర్కొన వచ్చును . శారీరక వైకల్యం ( అవయముల లోపం ) ఉన్న వ్యక్తులు నడవలేక పోవడం, తమంత తాముగా స్నానం చేయలేక పోవడం, తనకు సంబంధించిన ఏ పనినైనా స్వతంత్రంగా, కార్యాచరణ తో చేయలేక పోవడం వంటి వారిని మనము వికలాంగుల గా చెప్పవచును . ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల శారీరకంగా వికలాంగుడు కావచ్చు మొదటిది పుట్టుకతో వచ్చే / వంశపారంపర్యంగా వ్యక్తి పుట్టినప్పటి నుండి శారీరక వైకల్యం కలిగి ఉంటాడు లేదా జన్యుపరమైన సమస్యలు, కండరాల కణాలతో సమస్యలు, పుట్టినప్పుడు గాయం కారణంగా క్రమేణా అవి అభివృద్ధి కావడం తో వ్యక్తి చెందిన అంగ వైకల్యం గా చెప్ప వచ్చును . రెండవ కారణం నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులు, వీటి కారణంగా శరీరములో ఉన్న భాగాల యొక్క కదలికలను చేయలేకపోవడం గా చెప్పవచును . వ్యక్తులు రోడ్డు [ప్రమాదాలతో, పని చేసే కర్మాగారములలో గాయబడటం, పారిశ్రామిక ప్రమాదాలు, పోలియో వంటి అంటువ్యాధులు, గుండె పోటు , పక్ష పాతము క్యాన్సర్ వంటి వ్యాధుల తో మనుషులు అంగ వైకల్యం పొందుతాడు.[2]

శారీరక వైకల్యం ( అంగ వైకల్యం ) అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన, దీర్ఘకాలిక పరిస్థితి, ఇది వారి శారీరక పనితీరు, చైతన్యం, ధృడత్వం , వక్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. శారీరక వైకల్యం తప్పనిసరిగా నిర్దిష్ట పనులను చేయకుండా ఆపదు, కానీ వాటిని ఎదుర్కొన దానికి వ్యక్తులకు సవాలుగా చేస్తుంది. మనుషులు చేసే ప్రతి పనిలో ఎక్కవ సమయం తీసుకునే రోజువారీ పనులు ఉన్నాయి .శారీరక వైకల్యాన్ని నిర్వచించడం శారీరక స్థితి గురించి కాదు, పని కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఒక వ్యక్తి రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. శారీరక వైకల్యం ( అంగ వైకల్యం )లో ఉన్న వారిని సమాజము సముచితముగా మానవతా దృక్పథంతో వారిని సమాజ అభివృద్హిలో వారిని ప్రోత్సహించడమే మన ప్రథమ కర్తవ్యం . ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజములో ఉన్న మనుషుల సహకారం అవసరం.[3]

మూలాలు మార్చు

  1. "Rights of Persons with Disabilities (RPWD) Act, 2016 | National Centre for Promotion of Employment for Disabled People". www.ncpedp.org. Archived from the original on 2020-11-25. Retrieved 2020-12-14.
  2. "General Information on Physical Disabilities – Handicaps Welfare Association" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-14.
  3. "Types of physical disabilities". www.carehome.co.uk. Retrieved 2020-12-14.