వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 41వ వారం

ఈ వారపు బొమ్మ/2007 41వ వారం
బేలూరు చెన్నకేశ్వరాలయం

శిల్పకళలో జగత్ప్రసిద్ధిగాంచిన బేలూరు చెన్నకేశ్వరాలయం కర్ణాటక రాష్ట్రానికి చెందిన హసన్ జిల్లాలోని బేలూరులో ఉన్నది. హొయసలుల శిల్పశైలికి అద్భుత తార్కాణమైన ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు 1117లో తలకాడు వద్ద చోళులతో యుద్ధములో సాధించిన విజయానికి స్మారకముగా నిర్మింపజేశాడు. ఈ ఆలయ నిర్మాణము పూర్తికావటానికి 103 సంవత్సరాలు పట్టిందని, విష్ణువర్ధనుని మనుమడు రెండవ వీరబల్లాలుడు దీనిని పూర్తిచేశాడని ప్రతీతి.

ఫోటో సౌజన్యం: దినేష్ కన్నంబాడి