వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 06వ వారం

ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలతో పనిచేస్తారు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎలెక్ట్రిసిటీ, ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ . పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్ మరియు విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు వున్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా విద్యుత్ శక్తి వుత్పాదన మరియు పంపిణీ, యంత్రాల నియంత్రణ వంటి వాటికి వాడతారు.

17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. అలెస్సాండ్రో వోల్టా 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు. జార్జి ఓమ్ 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో , మైఖేల్ ఫారడే ,ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు , 1873లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. 1882 లో థామస్ అల్వా ఎడిసన్ రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. 1887 లో, నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ , టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.

చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. ట్రాన్సిస్టర్ ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంకా…