వికీపీడియా:ఈ వారపు వ్యాసం

తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు వ్యాసాల" లక్ష్యం. ఈ విధానం 2007 జూన్ లో(23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసంతో ప్రారంభమైంది. అంతకు ముందు విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. విశేష వ్యాస ప్రక్రియ ఆగష్టు 2005న మొదలయింది. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఈ వారం వ్యాసం శీర్షిక 2012 జూన్ 4 తో 6 వ సంవత్సరంలోకి అడుగిడింది

తొలి ఈ వారపు వ్యాసం

సుడోకు ఒక లాజిక్-భరితమైన గళ్ళ లో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికను సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస, అందులో ఉన్న తొమ్మిది 3x3 చతురస్రాలలో 1 నుండి 9 వరకు నింపడము. ప్రశ్న ప్రహేళికలో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన పజిలు ఒక రకమైన లాటిన్ చతురస్రము. లియొనార్డ్ ఆయిలర్ అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కాని, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము అమెరికాకు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళికను 1979లో డెల్ మ్యాగజిన్‌లో నంబర్ ప్లేస్ మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యాన్ని తీసుకొచ్చాడు. 2005లో ఈ పజిలు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది. "సుడోకు" జపనీసు వాక్యానికి సంక్షిప్త నామము, "సూజీ వ డొకుషిన్ ని కగీరూ", అనగా "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను" పూర్తివ్యాసం : పాతవి

ఈ వారపు వ్యాసంగా పరిగణించటానికి వ్యాసాలను ఎంపిక చేయటం

తెలుగు వికీపీడియాలో ఏవయినా వ్యాసాలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న వ్యాసాలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • వ్యాసం కనీసం పది కిలోబైట్లకు మించి ఉండాలి. 15-20 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసము శీర్షిక కు సంబంధించిన విషయాలు స్పృశించి ఉండాలి.
  • వ్యాసం గతంలో ఎపుడైనా ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.

ఈ వారం వ్యాసంగా ఎంపిక చేయటం

కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.

అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}} అనే మూసను చేర్చాలి.

మూసను చేర్చిన తరువాత, వ్యాసాలు వాటి తేదీ వచ్చిన వెంటనే, ఈ వారం వ్యాసాలు అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలోనే ఉంటాయి.

ఇవి కూడా చూడండి