వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 15వ వారం

[[దస్త్రం: |150px|right|]] తెలుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. భారత దేశం లో మాతృభాషగా తెలుగు మాట్లాడే 8.7 కోట్ల (2001 సంవత్సరపు లెక్కలు) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్ల మందికి మాతృభాషగా ఉన్నది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను కూడా అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

(ఇంకా…)