వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 24వ వారం
ఈజిప్టు పిరమిడ్లు
"పిరమిడ్" అనునది (మూస:Lang-el pyramis[1]) జ్యామితి పరంగా పిరమిడ్ వంటి నిర్మాణ ఆకృతి. దీని బయటి తలములు త్రిభుజాకారంగా ఉండి పై చివర ఒక బిందువుతో అంతమగును. దీని భూమి త్రిభుజ, చతుర్భుజ, లేదా ఏదైనా బహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. ప్రాచీన మరియు మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి.యివి క్రీ.పూ 2886-2160 నాటివి. నైలునదీ లోయకు 51 వ మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700 కి పైగా పిరమిడ్స్ గోచరిస్తాయి. ఈ పిరమిడ్స్ సమాధుల రూపాలు. వీటిలోఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సారలు పట్టి ఉందవచ్చునని చరిత్ర కారుల అంచనా.
(ఇంకా…)