వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 48వ వారం
శుశ్రుతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశ్రుతుడు, వారణాసిలో జన్మించాడు.ఇతని ప్రసిద్ధ గ్రంధం శుశ్రుత సంహిత వైదిక సంస్కృతం లో వ్రాయబడినది.ఈ శుశ్రుత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశ్రుతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశ్రుతుడు. క్రీ.శ. 800 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశ్రుతుణ్ణి భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశ్రుతుడి నివాస స్థానం. శుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశ్రుతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ శుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్‍లను కూడా ఆవిష్కరించాడు. మూత్ర పిండంలోని రాళ్లను తొలగించడంలో చైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.
(ఇంకా…)