వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 41వ వారం
వేప నూనెను వేప గింజల నుండి తీస్తారు. ఇది శాక తైలం. వంటనూనె కాదు. దీన్ని పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర నామం:అజాడిరక్టా ఇండికా.ఈ చెట్టు పుట్టుక స్థానం భారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగే సతతహరిత వృక్షం. వేపను నాలుగు వేల సంవత్సరాల నుండి ఆయూర్వేద వైద్య ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. వేపచెట్టు బెరడు,ఆకులు,వేరు ఓషధి గుణాలను పుష్కలంగా కలిగివున్నాయి. దీని పూలు చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూస్తాయి. పూత సమయం జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కే.జీ.ల వేపపండ్లు లభిస్తాయి. మూడు-నాలుగు సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి ఏడవ సంవత్సరం మొదలవుతుంది. వేపకాయలు మే-ఆగస్టు కల్లా పక్వానికి వస్తాయి. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుంటుంది. ఎండిన వేప పండులో నూనె 20-22 ఉంటుంది. ఎండినపండు లో పిక్క 23-25శాతం, పిక్క లో నూనె 45శాతం ఉంటుంది. పండు పైపొర 4.5 శాతం, గుజ్జు 40 శాతం, గింజపెంకు 15-20 శాతం వరకు ఉంటుంది. వేపనూనెలో 'అజాడిరక్టిన్' అనే ట్రిటెరిపెంటెన్ 0.03-0.25 శాతం (32-2500 ppm) ఉంటుంది . పళ్ళు దీర్ఘ అండాకారంలో 1-2 సెం.మీ. పొడవు ఉంటాయి. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉంటాయి. వేపగింజలోని విత్తనం గోధుమ రంగులో ఉంటుంది.
(ఇంకా…)