వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 50వ వారం
సిసిలీ మధ్యధరా సముద్రం (మెడిటరేనియన్ సముద్రం) లోని అతి పెద్ద ద్వీపం సిసిలీ. క్రీస్తు పూర్వం 8000 నుంచే ఇక్కడ మనుషులు జీవించిన దాఖలాలున్నాయి. క్రీస్తు పూర్వం 750లో ఇది గ్రీక్ కాలనీగా ఉండేది. మాఫియా ఇక్కడే పుట్టింది. ఈ రోజుకీ మాఫియా నేర చరిత్రగల వ్యక్తులు ఇటలీ, అమెరికా ఇంకా మరి కొన్ని దేశాల్లో ఉన్నారు. 1946లో ఇటాలియన్ రిపబ్లిక్ స్థాపించబడ్డాక సిసిలీకి స్వయం ప్రతిపత్తి కలిగింది. సంగీతం, ఆర్కిటెక్చర్, భాష, వంటకాల విషయంలో సిసిలీ పేరుపొందింది. ఎత్నా, ట్రోంబోలీ అనే అగ్నిపర్వతాలు సిసిలీ ద్వీపం ఉత్తర దిశలో ఉన్నాయి. గైడ్ సహాయంతో ట్రోంబోలీ అగ్నిపర్వతం మీదకి ఎక్కవచ్చు. ఒకవైపు వేడి లావా కారిన గుర్తులని గైడ్ చూపిస్తాడు. 2002లో వౌంట్ ఎత్నా బద్దలైంది. ఇక్కడ బీచ్‌లలోని ఇసుక నల్లగా ఉండడానికి కారణం ఆ బూడిదే. ఎత్నా యూరప్‌లోని అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ వేడినీటి బుగ్గలు కూడా ఉన్నాయి. యూరప్‌లో ప్రస్తుతం ఏక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతం ఎత్నానే. సమీపంలోని నెబ్రోడీ-మడోనీ పార్క్‌లని కూడా చూడవచ్చు. అత్యంత పురాతన రాతి ఇళ్లు అల్కాంతర రివర్ పార్కు మొదలైనవి కూడా చూడవచ్చు.క్రిస్టియన్స్ అధికంగా ఆరాధించే సెయింట్ పాల్ ఇక్కడి సెయింట్ జాన్స్ చర్చ్‌లో కొంత కాలం బోధనలు చేశాడు. రోమ్‌లో రెండేళ్లపాటు హౌస్ అరెస్టులో ఉన్నాక క్రీ.శ. 64లో ఆయనకి అక్కడ మరణ శిక్ష విధించారు. అదేచోట నేటి రోమ్ సెయింట్ పాల్ ఆఫ్ ది త్రీ ఫౌంటెన్స్ అనే ఫౌంటెన్‌ని ఆయన గుర్తుగా ఏర్పాటు చేశారు.
(ఇంకా…)