వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 23వ వారం

సల్ఫ్యూరిక్ ఆమ్లం

సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక బలమైన శక్తి వంతమైన ఖనిజ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం పదార్థాలను క్షయింపచేసే గుణం కల్గిన ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సంకేత అణుఫార్ములా H2SO4.సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అణుభారం 98.079 గ్రాములు/మోల్. ఇది కొద్దిగా ఘాటైన వాసన కల్గి ఉన్నది. సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేకుండా లేదా పసుపు రంగులో ఉండును. మరియు చిక్కనైన ద్రావణం. సల్ఫ్యూరిక్ ఆమ్లం అన్ని గాఢతలలో నీటిలోకరుగును. చారిత్రక పరంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని పిలిచేవారు. ఆమ్ల గాఢతను బట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క గుణాలు, ధర్మాలు మారును. సల్ఫ్యూరిక్ ఆమ్లంకు లోహాలను, జీవకణాలను హరించు గుణం, రాళ్ళను కూడా కరగించు లక్షణం ఆమ్లంకున్న బలమైన ఆమ్లగుణం వలన కల్గుతున్నది. అధిక గాఢత కల్గిన ఆమ్లాన్ని తాకడం వలన లేదా మీదపడటం వలన చాలా నష్టం కల్గును, తీవ్రగాయాలు ఏర్పడును. ఆమ్లం జలవిశ్లేషణ ద్వారా రసాయన గాయాలు ఏర్పరచగా, పదార్థాల నిర్జలీ కరణ వలన ఏర్పడు ఉష్ణం వలన రెండవస్థాయిలో తాపగాయాలు/కాల్పుబొబ్బలు ఏర్పడును. కళ్ళలో పడిన శాశ్విత అంధత్వం కల్గును. కడుపులోకి వెళ్ళిన లోపలి అవయవాలు నయంకాని విధంగా పాడైపో వును. అందు వలన ఈ అమ్లంను వాడునపుడు తగిన జాగ్రతలు తీసుకోన వలెను.

(ఇంకా…)