వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 32వ వారం

సర్దార్ గౌతు లచ్చన్న

గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి. ఆయన సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని , అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. ప్రకాశం పంతులు మరియు బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో, మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న,మధ్యపాన నిషేధం విషయం లో, ప్రకాశం పంతులు తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు.చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణాకొరకు మర్రి చెన్నారెడ్డి తో చేతులు కలిపాడు. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, వ్యతిరేకించి, స్వేచ్చ కోసం పోరాడాడు. చౌదరి చరణ్ సింగ్, జయప్రకాష్ నారాయణ, మసాని లతో పనిచేశాడు. తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్రానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న.కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య రంగా ప్రధమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా,రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న. సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్దానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానం గా పుట్టాడు. లచ్చన్న తాత.

(ఇంకా…)