వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 49వ వారం
తుత్తునాగం లేక జింకు అనునది ఒక రసాయనిక మూలకం. ఇది ఒక లోహం. మూలకాల ఆవర్తన పట్టికలో 12వ గ్రూపుకు చెందిన మొదటి మూలకం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 30. మూలకంయొక్క సంకేత అక్షరము Zn. జింకును ఇంకను యశదము, తుత్తునాగము అనియు పిలిచెదరు. శతాబ్దానికి ముందే తుత్తునాగమును ఒకమూలకంగా గుర్తించుటకు పూర్వమే దీనియొక్కఖనిజాన్ని ఇత్తడి తయారుచెయ్యడంలో ఉపయోగెంచేవారు. క్రీ.పూ.1400-1000 సంవత్సరాలకు చెందిన ఇత్తడిని పాలస్తీనా కనుగొన్నారు. ఐతిహాసికయుగమునకు చెందిన 87% జింకును కలిగిన ధాతువును ట్రాన్సిల్వానియ గుర్తించారు. క్రీ.పూ.శతాబ్ది నాటికే జూదియ లో, క్రీ.పూ.7వ శతాబ్దినాటికి పురాతన గ్రీసు రాగి మరియు జింకు మిశ్రణం వలన రూపొందించిన ఇత్తడి అనే మిశ్రమ ధాతువు వాడేవారు. అనగా అప్పటికే జింకు లోహంతో మానవునికి పరిచయం ఉంది. క్రీ.శ. 12 వ శతాబ్ది వరకు భారతదేశంలో తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అయ్యెడిది. ఇక యూరోపు ఖండంలో 16 వ శతాబ్ది చివరకు జింకు గురించి తెలియదు. భారతదేశంలో, రాజస్థాన్ రాష్టంలో గుర్తించిన జింకుగనులు క్రీ.పూ. 6వ శతాబ్దికి చెందినవి. అనగా ఇక్కడి జనులకు అప్పటికే జింకు లోహం గురించిన మంచి అవగాహన ఉంది. క్రీ.శ.1347నాటికి భారతదేశంలో జింకును ప్రత్యేక లోహంగా గుర్తించారు. అప్పటికి జింకు మానవుడు గుర్తించిన 8 వలోహం.
(ఇంకా…)