వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 30వ వారం
ఆముదము నూనె |
---|
ఆముదపు నూనె ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు. కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్. ఇది యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్కను ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు. మొక్క చాలా ఏపుగా చురుకుగా పెరుగును. ఇది సతత హరితపత్రమొక్క. ఇది సుమారు 2-5 మీ.ఎత్తు పెరుగును. మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును. హస్తాకారంగా చీలికలున్న ఆకులు 5-10 అంగుళా లుండును. పూలు పచ్చనిరంగుతోకూడిన పసుపురంగులో ఉండును. పూలు గుత్తులుగా పూయును. ప్రపంచంలో 30 కిపైగా దేశాలు ఆముదపు పంటను సాగుచేస్తున్నవి.అందులోఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో ఉంది. విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు. ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును. ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి, 'ఆముదపువాసన' అనే జననానుడి వచ్చింది. ఆముదపు నూనె మిగిలిన శాక నూనెలకంటె ఎక్కువ సాంద్రత మరియు స్నిగ్థత కలిగి ఉన్న నూనె. (ఇంకా…) |