వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 11వ వారం
టెర్రాఫార్మింగ్ |
---|
టెర్రాఫార్మింగ్ అనగా ఏదైనా గ్రహం లేదా సహజ ఉపగ్రహం లేదా వేరే ఏదైనా ఖగోళ వస్తువు యొక్క వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలను, ఉపరితల పరిస్థితులను, పర్యావరణాన్నీ భూమిని పోలినట్లు ఉండేలా మార్చి, ఆ ఖగోళ వస్తువును భూమిపై ఉండే జీవులకు నివాస యోగ్యంగా ఉండేలా మార్చడం. తెలుగులో దీన్ని భూమి తయారీ అనవచ్చు. టెర్రాఫార్మింగ్ భావన వైజ్ఞానిక కల్పన, వాస్తవ శాస్త్రం రెండింటి నుండీ అభివృద్ధి చెందింది. ఈ పదాన్ని జాక్ విలియమ్సన్ 1942 లో ఆస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్, లో ప్రచురించిన సైన్స్-ఫిక్షన్ చిన్న కథ (" కొలిజన్ ఆర్బిట్ ") లో రూపొందించారు. కాని ఈ భావన అంతకు ముందే ఉండి ఉండవచ్చు. ఒక గ్రహపు పర్యావరణాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చగలిగినప్పటికీ, అక్కడ ఏ అడ్డంకులూ ఉండని భూమి లాంటి వాతావరణాన్ని సృష్టించగల సాధ్యాసాధ్యాలు ఇంకా ధృవీకరణ కాలేదు. సాధారణంగా టెర్రాఫార్మింగ్ చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారు. గ్రహాన్ని వేడెక్కించి, దాని వాతావరణాన్ని మార్చడం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. నాసా ఈ అంశంపై గోష్ఠులు కూడా నిర్వహించింది. (ఇంకా…) |