వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 14వ వారం
కనువూరు విష్ణురెడ్డి |
---|
కనువూరు విష్ణురెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. 22 బెల్ట్ ఆస్టరాయిడ్లను, ఆరు బైనరీ ఆస్టరాయిడ్లనూ కనుగొన్న శాస్త్రవేత్త. వేరే శాస్త్రవేత్త కనుగొన్న ఒక గ్రహ శకలానికి "8068 విష్ణురెడ్డి" అని పెట్టిన గౌరవాన్ని పొందిన శాస్త్రవేత్త. తాను కనిపెట్టిన ఒక గ్రహ శకలానికి "భారత్ 78118" అని పేరుపెట్టారు. ఆయన ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన 1999 నుండి అవిరామంగా గ్రహశకలాల యావత్తు సమాచారాన్ని వివిధ వనరుల ద్వారా సేకరించడం ప్రారంభించి, దాదాపు ఆరువేల పేజీల సమాచారాన్ని ప్రోగుచేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇదే అభిరుచి, జిజ్ఞాస ఉన్న వారితో పరిచయం పెంచుకొని వారి సహాయ సహకారాలతో పరిశోధనలు చేసారు. వేల డాలర్లు ఖరీదు ఉన్న పాత టెలిస్కోపును కొనుక్కోలేని ఈయనకు ఇంటర్నెట్ స్నేహితులు స్వంత ఖర్చుతో పంపించారు. ఇంతలో అమెరికాలో అంరర్జాతీయ స్థాయిలో ఖగోళ పరిశోధనలకు సంబంధించిన వర్క్ షాపులో పాల్గొనడానికి "యాహూ" ఇంటర్నెట్ స్నేహితులు సహాయం అందించగా 2002 ఏప్రిల్ లో వర్క్ షాపులో పాల్గొని ఖగోళ శాస్త్రంలో తనకు తెలియని నూతన గవాక్షాలను ఆవిష్కరించుకున్నారు. మరింతగా తెలుసుకోండి. |