వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 04వ వారం
స్పేస్ షటిల్ |
---|
స్పేస్ షటిల్ పాక్షికంగా మరల మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ. భూ నిమ్న కక్ష్య లోకి వెళ్ళే నౌక ఈ వ్యవస్థలో భాగం. ఇది 1981 నుండి 2011 వరకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వారి అంతరిక్ష నౌకల కార్యక్రమంలో భాగంగా పనిచేసింది. అధికారికంగా ఈ కార్యక్రమం పేరు స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఎస్‌టిఎస్). పునర్వినియోగ అంతరిక్ష నౌకా వ్యవస్థ కోసం 1969 లో తయారు చేసిన ప్రణాళిక నుండి ఈ పేరును తీసుకున్నారు. ఆ ప్రణాళికలో అభివృద్ధి కోసం నిధులు సమకూర్చిన ఏకైక అంశం ఇది. నాలుగు కక్ష్య పరీక్షా యాత్రలలో మొదటిది 1981 లో జరిగింది. 1982 నుండి మొదలైన కార్యాచరణ యాత్రలకు ఇది నాంది పలికింది. మొత్తం ఐదు స్పేస్ షటిల్ ఆర్బిటర్ వాహనాలను నిర్మించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ (కెఎస్సి) నుండి 1981 నుండి 2011 వరకు ప్రయోగించిన మొత్తం 135 యాత్రల్లో అనేక ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రోబ్‌లు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ (HST) ను ప్రయోగించారు. కక్ష్యలో అనేక శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలు నిర్వహించారు; అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం లోను, మరమ్మత్తుల్లోనూ ఇవి పాల్గొన్నాయి. స్పేస్ షటిల్ చేసిన యాత్రలన్నింటి మొత్తం యాత్రా సమయం 1322 రోజుల, 19 గంటల, 21 నిమిషాల 23 సెకన్లు. (ఇంకా…) |